“వ‌కీల్ సాబ్” త‌ర్వాత కూడా వేణుశ్రీరామ్ కి ఇంత గ్యాపా..?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌కీల్ సాబ్ మూవీతో స‌క్స‌స్ సాధించారు. ఆ త‌ర్వాత పవన్ భీమ్లా నాయ‌క్ షూటింగ్ లో బిజీ అయ్యారు కానీ.. వ‌కీల్ సాబ్ డైరెక్ట‌ర్ నెక్ట్స్ మూవీ ఎవ‌రితో అనేది ఇంకా క‌న్ ఫ‌ర్మ్ కాలేదు.
వేణు శ్రీరామ్.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఐకాన్ మూవీ చేయాలి అనుకున్నారు. దిల్ రాజు ఈ సినిమాని నిర్మించాలి అనుకున్నారు. అఫిషియ‌ల్ గా అనౌన్స్ చేయ‌డం కూడా జ‌రిగింది కానీ.. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌లేదు.

బ‌న్నీ పుష్ప సినిమా స‌క్స‌స్ అవ్వ‌డంతో వెంట‌నే పుష్ప 2 చేయాలి అనుకుంటున్నారు. సుకుమార్ పుష్ప 2 వ‌ర్క్ త్వ‌ర‌లో స్టార్ట్ చేయ‌నున్నారు. అన్నీ అనుకున్న‌ట్టు జ‌రిగితే..ఫిబ్ర‌వ‌రి లేదా మార్చిలో పుష్ప 2 సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతుంది. ఆత‌ర్వాత బ‌న్నీ.. బోయ‌పాటి డైరెక్ష‌న్ లో మూవీ చేయ‌నున్నారు. గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ లో ఈ సినిమా ఉంటుంది. అందుచేత వేణు శ్రీరామ్ తో బ‌న్నీ సినిమా ఇప్ప‌ట్లో ఉండ‌క‌పోవ‌చ్చు.

దీంతో వేణు శ్రీరామ్ వేరే హీరోతో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. నానితో గ‌తంలో ఎంసీఏ సినిమా చేశారు. మ‌రోసారి వీరిద్ద‌రూ క‌లిసి సినిమా చేయ‌నున్న‌ట్టుగా టాక్ వ‌చ్చింది. స్టార్ట్ అయితే కానీ.. నిజ‌మ‌ని చెప్ప‌లేం. హీరోలు ఎవ‌రూ ఖాళీగా లేరు. అందుక‌నే ఈ గ్యాప్. వ‌కీల్ సాబ్ 2 అని టాక్ వ‌చ్చింది కానీ.. ప‌వ‌న్ బిజీగా ఉండ‌డంతో కుద‌ర‌క‌పోవ‌చ్చు. రంగ‌స్థ‌లం అనే బ్లాక్ బ‌స్ట‌ర్ ఇచ్చిన త‌ర్వాత సుకుమారే మూడు సంవ‌త్స‌రాలు వెయిట్ చేయాల్సి వ‌చ్చింది. ఈ లెక్క‌న వేణు శ్రీరామ్ కూడా మ‌రో రెండేళ్లు వెయిట్ చేయాల్సి వ‌స్తుందేమో.

Related Posts