‘హరోంహర’ టీజర్.. కొత్తగా ట్రై చేసిన సుధీర్ బాబు

జయాపజయాలతో సంబంధం లేకుండా కొత్త తరహా సినిమాల్లో నటించడానికి ఉత్సాహాన్ని చూపిస్తుంటాడు సుధీర్ బాబు. లేటెస్ట్ గా ‘హరోంహర’ అంటూ ఓ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ తో రాబోతున్నాడు. ఇప్పటివరకూ విడుదలైన ఈ సినిమా పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. లేటెస్ట్ గా ఈ మూవీ టీజర్ ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశాడు.

‘హరోంహర’ టైటిల్ ఎంత పవర్ ఫుల్ గా ఉందో.. టీజర్ కూడా అంతే ఇంటెన్స్ గా అనిపిస్తోంది. ‘ది రివోల్ట్’ అనే ట్యాగ్ లైన్ తో రాబోతున్న ఈ సినిమాలో సుధీర్ బాబు మేకోవర్ సరికొత్తగా ఉంది. సుధీర్ స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్స్, యాక్షన్ అన్నీ సమ్ థింగ్ స్పెషల్ గా ఉండబోతున్నాయని టీజర్ ను బట్టి తెలుస్తోంది. మాళవిక శర్మ హీరోయిన్ గా నటిస్తుండగా.. కీలక పాత్రల్లో సునీల్, జయప్రకాష్ కనిపించనున్నారు. సుమంత్ జి.నాయుడు నిర్మాణంలో జ్ఞానసాగర్‌ ద్వారక ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో 2024 ప్రథమార్థంలో ‘హరోంహర’ విడుదలకు ముస్తాబవుతోంది.

Related Posts