సందీప్ రెడ్డి వంగ నటించిన సినిమా ఏదో తెలుసా..?

‘అర్జున్ రెడ్డి’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో సెన్షేషన్ ని క్రియేట్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. అదే సినిమాను హిందీలో ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేసి అక్కడ కూడా హాట్ టాపిక్ అయ్యాడు. దాంతో ఆయన తాజాగా తెరకెక్కించిన ‘యానిమల్’ సినిమా మీద అటు నార్త్ లో ఇటు సౌత్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రన్‌బీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటించిన ఈ సినిమా డిసెంబర్ 1న రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈరోజు (27.11.2023) సాయంత్రం మల్లారెడ్డి యూనివర్సిటీలో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమానికి పాన్ ఇండియన్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు గెస్టులుగా విచ్చేయనున్నట్టు సమాచారం.

అయితే, సందీప్ రెడ్డి వంగా దర్శకుడు మాత్రమే కాదు నటుడు కూడా అని ఓ వీడియో ద్వారా తెలిసింది. గతంలో నాగార్జున నటించిన ‘కేడి’ సినిమా. ఇందులో సందీప్ చిన్న రోల్ చేశాడు. కిరణ్ దర్శకత్వం వహించిన ఈ మూవీకి సందీప్ దర్శకత్వ విభాగంలో పనిచేశాడు. ఆయన అసిస్టెంట్‌గా చేసిన ఒకే ఒక్క సినిమా కూడా ఇదే కావడం విశేషం. ఈ మూవీలోనే సందీప్ రెడ్డి నటించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Related Posts