‘యానిమల్’కి గట్టి పోటీ ఇస్తోన్న ‘సామ్ బహదూర్’

ఈవారం థియేటర్లలోకి రాబోతున్న క్రేజీ మూవీ ‘యానిమల్’. పాన్ ఇండియా లెవెల్ లో డిసెంబర్ 1న ఈ చిత్రం గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కు రెడీ అవుతోంది. అయితే.. ఈ సినిమాకి తెలుగులో పెద్దగా పోటీ లేకపోయినా.. బాలీవుడ్ లో మాత్రం ‘సామ్ బహదూర్’ మూవీ నుంచి టఫ్ కాంపిటేషన్ ఉంది. విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘సామ్ బహదూర్’. 1971 ఇండో-పాకిస్తాన్ వార్ లో ఇండియన్ ఆర్మీకి ఛీప్ గా ఉన్న సామ్ మానేక్షా జీవితకథ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఈ మూవీలో సామ్ మానేక్షా పాత్రలో విక్కీ కౌశల్ నటించాడు.

‘రాజీ’ ఫేమ్ మేఘనా గుల్జార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది. వార్ మూవీస్ తీయడంలో ఎక్స్ పెర్ట్ అయిన మేఘనా గుల్జార్.. ఈ మూవీలో వార్ సీన్స్ ను అద్భుతంగా తీర్చిదిద్దినట్టు ప్రచార చిత్రాలను చూస్తే అర్థమవుతోంది. సామ్ మానేక్షా భార్య పాత్రలో సన్య మల్హోత్రా నటించగా.. ఇందిరా గాంధీ గా ఫాతిమా సానా షేక్ కనిపించనుంది. ఇప్పటికే ‘యానిమల్’కి దీటుగా టిక్కెట్ బుకింగ్స్ లో దూసుకుపోతుంది ‘సామ్ బహదూర్’. మొత్తంమీద.. ఒకేరోజు ఆడియన్స్ ముందుకొస్తున్న ఈ రెండు సినిమాలు ఎలాంటి విజయాలు సాధిస్తాయో చూడాలి.

Related Posts