ప్రభాస్, పవన్ రూట్ లో అల్లు అర్జున్ ..?

ఐకన్ స్టార్ గా తనకంటూ తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు అల్లు అర్జున్. అతని లేటెస్ట్ మూవీ పుష్ప భారీ అంచనాలతో వచ్చినా.. వాటిని అందుకోవడంలో కాస్త తడబడింది. వైవిధ్యమైన నేపథ్యంలో వచ్చిన పుష్ప సెకండ్ హాఫ్ మైనస్ మారిందనే టాక్ తెచ్చుకున్నాడు. అయినా బన్నీ క్రేజ్ వల్ల మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. కాకపోతే రికార్డ్స్ క్రియేట్ చేయడం కష్టం అనేది ట్రేడ్ టాక్. ఆ టాక్ మేటర్ ఎలా ఉన్నా.. వచ్చే యేడాది ఫిబ్రవరి నుంచి పుష్ప సెకండ్ పార్ట్ షూటింగ్ లో పార్టిసిపేట్ చేయబోతున్నాడు అల్లు అర్జున్. ఈ మేరకు స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయిందంటున్నారు. ఇక ఆ తర్వాత చేయబోయే సినిమా విషయంలో ప్రభాస్, పవన్ కళ్యాణ్ రూట్ లో వెళ్లబోతున్నాడు అల్లు అర్జున్.
తెలుగులోనే కాక ఇతర భాషల్లో కూడా ఇప్పుడు కొత్త కథలు లేకపోయినా.. కొత్త నేపథ్యంలో పాత కథలను చెబుతున్నారు. ఇది ప్రేక్షకులకు కూడా కొత్త అనుభూతిని పంచుతుంది. ఆయా నేపథ్యాలు భూతకాలంలో ఉంటే ఇంక ఆ కాలాన్ని కూడా ఫీల్ అవుతారు ఆడియన్సెస్. ప్రభాస్ ప్రస్తుతం చేసిన రాధేశ్యామ్ పీరియాడిక్ మూవీగా 1960ల నేపథ్యంలోని కథగా వస్తోంది. పైగా యూరప్ బ్యాక్ డ్రాప్. మరి ఆ కాలంలో
ఆ దేశం ఎలా ఉందనేది మనమే కాదు.. వాళ్లూ ఫీలవుతారు కదా. అలాగే పవన్ కళ్యాణ్ చేస్తోన్న హరిహర వీరమల్లు కూడా ఫిక్షనల్ పీరియాడిక్ డ్రామానే. క్రిష్ డైరెక్షన్ లో రూపొందుతోన్న ఈ చిత్రం 18వ శతాబ్ధంనాటి కథగా చెబుతారట. దీంతో ఈ రూట్ లో ఇప్పుడు బన్నీ కూడా బయలుదేరబోతున్నాడు.
పుష్ప ది రూల్ తర్వాత అతను బోయపాటి శ్రీనుతో సినిమా చేయబోతున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లోనే రూపొందే ఈ చిత్రాన్ని కూడా పీరియాడిక్ డ్రామాగా ఉంటుందట. ఈ మేరకు బోయపాటి ఓ లైన్ ను బన్నీకి వినిపించాడనీ.. అతను వెంటనే ఓకే చెప్పాడంటున్నారు. అల్లు అర్జున్ పుష్ప సెకండ్ పార్ట్ పూర్తి చేసేలోగా బోయపాటి పూర్తి స్క్రిప్ట్ తో సిద్ధంగా ఉంటాడు. అన్నీ కుదిరితే 2022 మలిసగం నుంచి ఈ పీరియాడిక్ మూవీ స్టార్ట్ అవుతుందంటున్నారు. అంటే భారీగానే ఉంటుందన్నమాట. ఈ ఇద్దరి కాంబినేషన్ లో గతంలో సరైనోడు చిత్రం వచ్చింది. ఇది అల్లు అర్జున్ ఫస్ట్ టైమ్ వంద కోట్ల క్లబ్ లో ఎంటర్ చేసిన సినిమా. మరి ఈ సారి ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తారో చూడాలి.

Related Posts