బుర్జ్ ఖ‌లీఫాలో గ్రాండ్ సెల‌బ్రిటీ క్రికెట్‌ లీగ్ (CCL) 2024 ప్రోమో లాంఛ్‌

క్రికెట్ లీగ్స్ లో సెల‌బ్రిటీ క్రికెట్ కు ఉండే మ‌జానే వేరు. ప్ర‌తి సంవ‌త్స‌రం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా జ‌రిగే సెల‌బ్రిటీ క్రికెట్ లీగ్ ఈ సంవ‌త్స‌రం కూడా ఉండ‌బోతుంది. సెల‌బ్రిటీ క్రికెట్ లీగ్ 10 కు సంబంధించిన ప్రోమోను దుబాయ్ లోని వండ‌ర్‌ఫుల్ బుర్జ్ ఖ‌లీఫా పై (2 ఫిబ్ర‌వ‌రి 2024) న లాంఛ్ చేసారు. సెల‌బ్రిటీ క్రికెట్ లీగ్ మొత్తం 8 జ‌ట్ల నుంచి సూపర్ స్టార్లు, కెప్టెన్లు కిచ్చా సుదీప్ (కన్నడ), సోహైల్ ఖాన్ (హిందీ), ఆర్య, జీవా (తమిళం), థమన్ & సుధీర్ బాబు (తెలుగు), జిస్సు సేన్‌గుప్తా (బెంగాల్), బన్ను ధిల్లాన్, సోనూ సూద్ (పంజాబీ), ఇంద్రజిత్ సుకుమారన్, ఉన్ని ముకుందన్ (మలయాళం) దుబాయ్‌లో ప్రత్యక్షంగా వీక్షించారు.

CCL(సెల‌బ్రిటీ క్రికెట్ లీగ్‌) అనేది సినిమా, క్రికెట్‌ను కలిపే స్పోర్ట్స్‌టైన్‌మెంట్‌. భారతదేశంలో 8 సినీ ఇండ‌స్ట్రీల నుండి 200+ మంది నటీనటులను ఒకచోట చేర్చే ఏకైక స్పోర్ట్స్ లీగ్. ఇది క్రీడలు, వినోదాల కలయిక. CCL 2024 యొక్క మొద‌టి ప్రీమియ‌ర్‌ లీగ్ ఫిబ్రవరి 23న షార్జాలో ప్రారంభమవుతుంది. భారతదేశంలో మరో మూడు వీకెండ్స్ లో 20 యాక్షన్-ప్యాక్డ్, అద్భుతమైన మ్యాచ్‌లతో క్రికెట్ అభిమానులను, ప్రేక్షకులను అలరిస్తుంది. ఆడ్రినలిన్-పంపింగ్ టోర్నమెంట్ సోనీ స్పోర్ట్స్ టెన్ 5, జియో సినిమా, పలు ప్రాంతీయ ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.

సెలబ్రిటీ క్రికెట్ లీగ్ వ్యవస్థాపకుడు & మేనేజింగ్ డైరెక్టర్ విష్ణు వర్ధన్ ఇందూరి మాట్లాడుతూ, “CCL మొదటి నుంచి అద్భుతంగా అలరిస్తుంది. ప్రతి సంవత్సరం లీగ్ వృద్ధి చెందడం లీగ్ లో క్రికెట్ ఆడే ప్లేయర్స్ ప్యాషన్ కి ప్రతిబింబం. CCL 2024 గతంలో కంటే చాలా పెద్ద‌గా ఉండబోతుంది” అన్నారు

బుర్జ్ ఖ‌లీఫా పై ప్రోమో లాంఛ్ గురించి క‌ర్నాట‌క్ బుల్డోజ‌ర్స్ కెప్టెన్ స్టార్ హీరో కిచ్చా సుదీప్ మాట్లాడుతూ ఈ విధంగా మాట్లాడారు. ఇప్ప‌టి వ‌ర‌కు నా సినిమాల ట్రైల‌ర్ షోస్ గురించి బుర్జ్ ఖ‌లీఫా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చాను, కానీ ఇపుడు ఒక న‌టుడిగా కాకుండా ఒక క్రికెట‌ర్ గా బుర్జ్ ఖ‌లీఫాలో ఉండ‌డం నాకు చాలా స్పెష‌ల్ అని అన్నారు.

పంజాబ్ దే షేర్ టీం కెప్టెన్ సోనూ సూద్ మాట్లాడుతూ “మన గొప్ప దేశంలోని 8 పవర్ ఫుల్ ఫిల్మ్ ఇండస్ట్రీలు ప్రాతినిధ్యం వహిస్తున్న సూపర్‌స్టార్‌లతో కలిసి ఉండటం, ప్రపంచంలోని ఎత్తైన ఐకానిక్ నిర్మాణం ముందు నిలబడి మొత్తం భారతదేశం ఉద్వేగభరితంగా ఇష్టపడే లీగ్ ప్రారంభోత్సవాన్ని వీక్షించడం ఒక అద్భుతమైన అనుభవం. ఈ సంవత్సరం CCL అద్భుతమైన ఎడిషన్‌గా అలరిస్తుంది” అన్నారు.

Related Posts