దిల్ రాజు చేతుల మీదుగా ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి టీజ‌ర్ లాంఛ్

30 వెడ్స్ 21, కీడా కోలా ఫేమ్ చైత‌న్య రావు, భూమి శెట్టి జంట‌గా కుమార స్వామి ద‌ర్శ‌క‌త్వంలో స్టార్ లైట్ స్టూడియోస్ బ్యాన‌ర్ పై సామ‌ల నాగార్జున‌, శ్రీష్ కుమార్ గుండా, డాక్ట‌ర్ కృష్ణ‌కాంత్ చిత్త‌జ‌ల్లు నిర్మించిన చిత్రం “ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి”. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “షరతులు వర్తిస్తాయి” త్వరలో థియెట్రిక‌ల్ గా రిలీజ్‌ కు రెడీ అవుతోంది. ఈ సినిమా టీజర్ విడుదల కార్యక్ర‌మం స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ముఖ్య అతిథిగా హైదరాబాద్ లో ఘ‌నంగా నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మంలో విరాట‌ ప‌ర్వం ద‌ర్శ‌కుడు వేణు ఊడుగుల‌, మామిడి హరికృష్ణ ప్ర‌త్యేక అతిథులుగా పాల్గొన్నారు.

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ – బ‌ల‌గం సినిమా చేసిన టైమ్‌లో మామిడి హరికృష్ణ గారితో నాకు పరిచయం ఏర్పడింది. మామిడి రామ‌కృష్ణ గారు ఒకసారి రవీంద్రభారతికి తీసుకెళ్లి వాళ్లు చేసే ట్రైనింగ్ కార్యక్రమాలు చూపించారు. సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకునే ఔత్సాహికులకు వాళ్లు కల్చరల్ డిపార్ట్ మెంట్ ద్వారా ఇస్తున్న ట్రైనింగ్, ఇతర కార్యక్రమాల గురించి తెలిసి హ్యాపీగా ఫీలయ్యా. మేము మా దగ్గరకు వచ్చే రైటర్స్, డైరెక్టర్స్ కు అవకాశాలు ఇస్తుంటాం. అయితే వీళ్లు మంచి ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమాలు చేపట్టారు. ఒక మంచి కాన్సెప్ట్ తీసుకుని “ష‌ర‌తులు వ‌ర్తిసాయి” సినిమాను రూపొందించారు. సాంగ్, టీజర్ చూశాను. బాగున్నాయి. బలగం కంటే ఎక్కువగా తెలంగాణ నేటివ్ తో తెరకెక్కించారు. ఇదొక మంచి సినిమా అవుతుందని ఆశిస్తున్నా. మూవీ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. అన్నారు.

తెలంగాణ సాంస్కృతిక శాఖ డైరెక్ట‌ర్, క‌వి, సినీ విమ‌ర్శ‌కులు, చ‌రిత్ర కారులు మామిడి హరికృష్ణ మాట్లాడుతూ – “ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి” టీజర్ లాంఛ్ కు వచ్చిన దిల్ రాజు గారికి ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు. మనం సాధించిన దాని నుంచి సమాజానికి తిరిగి ఏదైనా ఇవ్వాలని కోరుకునే మంచి వ్యక్తులు నాగార్జున సామల, శ్రీష్ కుమార్ గార్లు. వాళ్లు తమ ఫ్రెండ్ డా.కృష్ణకాంత్ చిత్తజల్లు గారితో కలిసి నిర్మించిన సినిమా ఇది. ఈ ముగ్గురు లేకుంటే ఈ సినిమా ఉండేది కాదు. సహజమైన కథా కథనాలతో కొంత సినిమాటిక్ లిబర్టీ తీసుకుని ప్రేక్షకులకు నచ్చే అన్ని అంశాలతో రూపొందిన సినిమా ఇది.

దర్శకుడు కుమారస్వామి మంచి రైటర్. అతను సినిమా చేయాలనే కలతో గోదావరి ఖని ప్రాంతం నుంచి వచ్చాను. ఇవాళ ఆ కల నెరవేర్చుకున్నాడు. పాత్రల్లో జీవించే అతి కొద్ది మంది నటుల్లో చైతన్య రావ్ ఒకరు. ఆయన 30 వెడ్స్ 21 నుంచి కీడా కోలా వరకు డిఫరెంట్ కాన్సెప్ట్స్ చేస్తూ నటుడిగా పేరు తెచ్చుకుంటున్నాడు. అలాగే హీరోయిన్ భూమి శెట్టికి కూడా ఈ సినిమాతో మంచి గుర్తింపు దక్కుతుంది. అన్నారు.

అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు, నీది నాది ఒకే క‌థ‌, విరాట‌ప‌ర్వం తో పాటు ప‌లు చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌ని చేసిన కుమారస్వామి ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా మారారు. ఈ సంద‌ర్భంగా – మా “ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి” సినిమా ఫస్ట్ లుక్ లాంఛ్ చేసిన త్రివిక్రమ్ గారికి, సాంగ్ రిలీజ్ చేసిన శేఖర్ కమ్ముల గారికి, ఇప్పుడు టీజర్ విడుదల చేసిన దిల్ రాజు గారికి, మాకు సపోర్ట్ చేస్తున్న మధుర శ్రీధర్ గారికి థ్యాంక్స్. ప్రేక్షకులకు సినిమా అనేది చిన్న‌దా పెద్ద‌దా అనే తేడా ఉండ‌దు, అది మంచి సినిమా అయితే చాలు ప్రేక్ష‌కులు తప్పకుండా చూస్తారు. మా ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి సినిమాలో మంచి కంటెంట్ ఉంది. ఈ సినిమాకు ప్రేక్షకుల ఆదరణ ఖ‌చ్చితంగా దక్కుతుందని నాతో పాటు సినిమా యూనిట్ మొత్తం ఆశిస్తున్నారు. ఈ సినిమా చేసే క్రమంలో హీరో చైతన్య, హీరోయిన్ భూమి శెట్టి నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చారు అని ద‌ర్శ‌కుడు కుమార స్వామి అన్నారు.

హీరోయిన్ భూమి శెట్టి మాట్లాడుతూ – నేను కన్నడ ఇండ‌స్ట్రీకి చెందిన అమ్మాయిని. “ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి” సినిమా కోసం డైరెక్టర్ కుమారస్వామి కాల్ చేసినప్పుడు ఫ్రాంక్ కాల్ చేసారు అనుకున్నా. ఈ సినిమాలో నాకు అవకాశం అనుకోకుండా వచ్చింది. ఇందులో తెలంగాణ యాస‌లో మాట్లాడడం కోసం క‌రీంన‌గ‌ర్ వెళ్లి షూటింగ్ గ్యాప్ లో నేర్చుకుంటూ వ‌చ్చాను. “ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి” ఒక మంచి మూవీ. మీ ముందుకు త్వరలో వస్తుంది. మీ సపోర్ట్ ఇలాగే ఉంటుందని కోరుకుంటున్నా. అన్నారు.

హీరో చైతన్య రావ్ మాట్లాడుతూ – ఈ రోజుల్లో ఒక చిన్న సినిమా థియేటర్స్ దాకా రావడం చాలా కష్టంగా ఉంటోంది. అయితే త్రివిక్రమ్, శేఖర్ కమ్ముల, దిల్ రాజు, వేణు ఊడుగుల వంటి గొప్ప ద‌ర్శ‌కుల ద్వారా మాకు మంచి సపోర్ట్ లభిస్తోంది. క‌రీంన‌గ‌ర్ లో పుట్టిన నేను ఇపుడు న‌టుడిగా ఒక మంచి స్థాయికి వ‌స్తున్నాను, ఇలాంటి స‌మయంలో తిరిగి మా క‌రీంన‌గ‌ర్ లోనే సినిమా షూటింగ్ చేయడం ఒక అఛీవ్ మెంట్ లా అనిపించింది. “ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి” సినిమాతో డైరెక్టర్ కుమారస్వామి తనదైన ముద్ర వేసుకుంటారు. ఈ రోజుల్లో ఒక సున్నితమైన కథకు కమర్షియల్ ఎలిమెంట్స్ ను జోడించి అందరికీ నచ్చేలా సినిమా చేయ‌డం అనేది అంత సులువైన విష‌యం కాదు. ఈ సినిమా తర్వాత కుమారస్వామి మరిన్ని మంచి మూవీస్ చేస్తాడు. త్వరలోనే “ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి” సినిమా థియేటర్స్ లోకి వస్తుంది. మీరంతా ఆదరించాలని కోరుకుంటున్నా. అన్నారు.

నటి పద్మావతి మాట్లాడుతూ – ఈ సినిమాలో నేను హీరో చైత‌న్య రావ్ కు మ‌ద‌ర్‌ రోల్ ప్లే చేశాను. చాలా మంచి క్యారెక్టర్ ఇది. ఈ పాత్ర ద్వారా నేను ప్రేక్షకుల‌కు బాగా రీచ్ అవుతుందని షూటింగ్ టైమ్ లోనే నమ్మకం కలిగింది. చైతన్య రావ్ చేస్తున్న మరో సినిమాలో కూడా నటిస్తున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి థ్యాంక్స్. అన్నారు

డైలాగ్, లిరిక్ రైటర్ పెద్దింటి అశోక్ కుమార్ మాట్లాడుతూ – డైరెక్టర్ కుమారస్వామి ఫస్ట్ నా దగ్గరకు మాటలు రాయమని వచ్చాడు. పాట‌లు రాసే నేను అద్భుత‌మైన డైలాగ్స్ రాయ‌గ‌ల‌ను అని న‌న్ను ద‌ర్శ‌కుడు కుమార‌స్వామి న‌మ్మారు. ఆ త‌రువాత‌ ఇందులో ఓ పెండ్లి పాట రాయించాడు. కొన్ని రోజులకు ఈ సినిమాలో ఓ క్యారెక్టర్ చేయాలని అడిగాడు. ఆ క్యారెక్టర్ ఏదో చిన్నది అనుకున్నా..ఈ సినిమాలో కీలకమైన పాత్ర ఇచ్చాడు. అది నా రియల్ లైఫ్ కు భిన్నమైన క్యారెక్టర్. “ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి” సినిమా దర్శకుడిగా కుమారస్వామికి గొప్ప అరంగేట్రం అవుతుంది. ఇదొక మంచి సినిమాగా పేరు తెచ్చుకుంటుంది. అన్నారు.

ప్రొడ్యూసర్ డా.కృష్ణకాంత్ చిత్తజల్లు మాట్లాడుతూ – చాణక్యుడు, చంద్రగుప్తుడు కలిస్తే ఎలా ఉంటారో ఈ సినిమాలో మా హీరో క్యారెక్టర్ అలా ఉంటుంది. పెళ్లికి ముందు ప్రేయసితో సరదాగా ఉండటం, పెళ్లయ్యాక ఫ్యామిలీగా బాధ్యతలు నెరవేరుస్తూ…సొసైటీ లోని ఒక సమస్యను పరిష్కరించేందుకు ఎలా ముందుకు వచ్చాడనేది ఈ సినిమా కథ. ప్రతి పాత్రను అందంగా తీర్చిదిద్దారు మా దర్శకుడు కుమారస్వామి. సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా ఒక మంచి సినిమా చూశామనే ఫీల్ కలిగిస్తుంది. అన్నారు

డైరెక్టర్ వేణు ఊడుగుల మాట్లాడుతూ – ద‌ర్శ‌కుడు కుమారస్వామి నాతో దాదాపు పదేళ్లుగా ట్రావెల్ చేస్తున్నాడు. అతను చాలా టాలెంట్, మంచితనం ఉన్న వ్యక్తి. కుమారస్వామి కష్టపడి ఈ మూవీ రూపొందించాడు. రెండేళ్ల క్రితమే ఈ స్క్రిప్ట్ చదివాను. ఒక గొప్ప అనుభూతి కలిగించింది. ఈ కథలో దర్శకుడు క్రియేట్ చేసిన క్యారెక్టర్స్, చెప్పాలనుకున్న అంశాలు బాగుంటాయి. అవన్నీ కమర్షియల్ పద్ధతిలోనే సినిమా చూసేవాళ్లకు నచ్చేలా రూపొందించాడు. మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి, వెనకబడిన ప్రజల జీవితాల్లోని లైఫ్ స్టైల్, ఎదగాలనే తపనతో స్థానికత ఉట్టిపడేలా సినిమా తెరకెక్కించాడు. “ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి” సమాజంలో ఒక చర్చకు దారితీసే సినిమా అవుతుంది. దర్శకుడిగా కుమారస్వామి మంచి పేరు తెచ్చుకుంటాడు. అన్నారు.

Related Posts