”నేను స్టూడెంట్ సర్!’ ఫస్ట్ సింగిల్ లాంచ్

‘స్వాతిముత్యం’ ఆకట్టుకున్న యంగ్ హీరో బెల్లంకొండ గణేష్  తన రెండో సినిమా ”నేను స్టూడెంట్ సార్!’ తో ప్రేక్షకులముందుకు రాబోతున్నారు. ఎస్వీ2 ఎంటర్‌ టైన్‌ మెంట్ బ్యానర్‌ లో ప్రొడక్షన్ నంబర్ 2 గా వస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ని ‘నాంది’ సతీష్ వర్మ నిర్మిస్తుండగా నూతన దర్శకుడు రాకేష్ ఉప్పలపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ”నేను స్టూడెంట్ సర్!’  టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. 

ఇప్పుడు, మేకర్స్  మ్యూజికల్ ప్రమోషన్లను ప్రారంభించారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్  గోపీచంద్ మలినేని ఈ సినిమా ఫస్ట్సింగిల్ మాయే మాయే లిరికల్ వీడియోను లాంచ్ చేశారు. క్యాచి ట్యూన్ తో ఆకట్టుకునే మెలోడీ గా ఈ పాటని స్వరపరిచారు మహతి స్వర సాగర్. మహతితో పాటు కపిల్ కపిలన్‌ ఈ పాటని మ్యాజికల్ గా ఆలపించారు. 

కృష్ణ చైతన్య సాహిత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కథానాయకుడు గణేష్‌ కి అవంతిక దస్సానిపై ఉన్న ప్రేమను ఈ పాట వర్ణిస్తుంది. శ్రోతలను ఆకట్టుకోవడానికి కావాల్సిన అన్ని అంశాలు మాయే మాయే పాటలో వున్నాయి. మహతి మొదటి పాటతోనే చార్ట్ బస్టర్ నెంబర్ ని అందించారు. గణేష్, అవంతిక ఇద్దరూ తెరపై కూల్ గా కనిపిస్తున్నారు.

ఈ చిత్రానికి కథను కృష్ణ చైతన్య అందించారు. అనిత్ మాదాడి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, చోటా కె ప్రసాద్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. కళ్యాణ్ చక్రవర్తి ఈ చిత్రానికి డైలాగ్స్ అందిస్తున్నారు.

ఈ సినిమా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.

నటీనటులు: బెల్లంకొండ గణేష్, అవంతిక దస్సాని, సముద్రఖని, సునీల్, శ్రీకాంత్ అయ్యంగార్, ఆటో రాంప్రసాద్, చరణ్‌దీప్, ప్రమోధిని, రవి శివతేజ తదితరులు.

Telugu 70mm

Recent Posts

‘కల్కి’ కొత్త విడుదల తేదీ ఫిక్సైంది?

రెబెల్ స్టార్ ప్రభాస్ 'కల్కి' సినిమా ఎప్పుడెప్పుడు వస్తోందా? అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. మే 9న ఈ సినిమా…

50 mins ago

సుహాస్ సరికొత్త ప్రయోగం ‘ప్రసన్నవనదం’

నాని తర్వాత అలాంటి నేచురల్ పెర్ఫామెన్స్ తో టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు సుహాస్. బ్యాక్ టు…

60 mins ago

సుకుమార్ కాంపౌండ్ నుంచి మరో డైరెక్టర్

హీరో డామినేటింగ్ ఇండస్ట్రీగా చెప్పుకునే ఫిల్మ్ ఇండస్ట్రీలో కొంతమంది డైరెక్టర్స్ కి ఉండే క్రేజే వేరు. ఆ దర్శకులు హీరోలకు…

1 hour ago

మరోసారి థియేటర్లలోకి వస్తోన్న ‘వకీల్ సాబ్’

'అఙ్ఞాతవాసి' తర్వాత అసలు సినిమాలే చేస్తాడో? లేదో? అనే సస్పెన్స్ కు తెరదించుతూ 2021లో 'వకీల్ సాబ్'తో గ్రాండ్ రీఎంట్రీ…

2 hours ago

Allari Naresh following serious path

Allari Naresh is the hero who crossed the milestone of 50 films in Telugu within…

16 hours ago

Satyabhama’ in romantic mode

Kajal Aggarwal will be seen in the role of a powerful police officer in the…

16 hours ago