మహాశివరాత్రి కానుకగా గోపీచంద్ ‘భీమ‘

ఫెస్టివల్ సీజన్లలోనే సినిమాలను విడుదల చేయడానికి ఉత్సాహాన్ని చూపిస్తుంటారు దర్శకనిర్మాతలు. ఈకోవలోనే రాబోయే మహాశివరాత్రి కానుకగా మార్చి 8న తన ‘భీమా‘ని బాక్సాఫీస్ బరిలోకి దింపుతున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు మ్యాచో స్టార్ గోపీచంద్.
శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కన్నడ డైరెక్టర్ ఎ.హర్ష దర్శకుడు. కన్నడలో పలు విజయవంతమైన సినిమాలు తీసి యాక్షన్ డైరెక్టర్ గా గుర్తింపు సంపాదించాడు హర్ష. ఇటీవల విడుదలైన ‘భీమా‘ టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ మూవీలో గోపీచంద్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. గోపీచంద్ కి జోడీగా ప్రియా భవాని శంకర్, మాళవిక శర్మ నటిస్తున్నారు. నాజర్, నరేష్, పూర్ణ, వెన్నెల కిషోర్ ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ముందుగా ఫిబ్రవరి 16న విడుదల తేదీ ఖరారు చేసుకున్న ‘భీమా‘.. మహాశివరాత్రి కానుకగా మార్చి 8న రాబోతుంది. అయితే.. అదే సమయంలో రామ్, పూరి జగన్నాథ్ ‘డబుల్ ఇస్మార్ట్‘ కూడా బరిలో ఉంది.

Related Posts