అల్లు ఆర్మీకి గుడ్‌న్యూస్ – బ‌న్నీ హాలీవుడ్ మూవీ… త‌గ్గేదేలే!


అల్లు ఆర్మీకి గుడ్‌న్యూస్‌. అల్లు అర్జున్ త్వ‌ర‌లోనే హాలీవుడ్ సినిమాకు సంత‌కాలు చేయ‌బోతున్నాడు. అది కూడా ఓ బిగ్ సూప‌ర్‌హీరో ఫ్రాంఛైజీ కోసం…! ఇంత‌క‌న్నా గుడ్‌న్యూస్ ఇప్ప‌ట్లో ఇంకేం వ‌ద్ద‌ని అంటున్నారా? మ‌రి అల్లు అర్జునా మ‌జాకా?
ఆఫ్ట‌ర్ ప్యాండ‌మిక్ త‌న ఆర్మీకి స‌ర్‌ప్రైజులిస్తూనే ఉన్నాడు బ‌న్నీ. లాస్ట్ డిసెంబ‌ర్‌లో పుష్ప సైలెంట్ బ్లాక్ బ‌స్ట‌ర్‌. ఆ త‌ర్వాత పుష్ప‌2 మీద అంచ‌నాలు. అప్పుడే ఓ ఎండార్స్ మెంట్‌. అది జ‌నాల్లో కాస్త మ‌రుగున‌ప‌డ‌గానే లిక్క‌ర్ యాడ్ ఆఫ‌ర్ వ‌చ్చింది… వ‌ద్ద‌న్నాడూ అంటూ న్యూస్‌. అది అలా ప‌క్క‌కు జ‌రిగిందో లేదో, గుట్కా యాడ్ వ‌స్తే సారీ చెప్పేశాడూ అని ఇంకో న్యూస్‌. రీసెంట్ గా పుష్ప‌2 సినిమా ఓపెనింగ్‌. ఇప్పుడైతే ఏకంగా హాలీవుడ్ సినిమా క‌బురు. ఇన్ని విష‌యాలు వ‌రుస‌గా వింటుంటే ఉబ్బిత‌బ్బిబ్బ‌యిపోతున్నారు బ‌న్నీ ఫ్యాన్స్.
ఈ మ‌ధ్య న్యూయార్క్ లో ఉన్న బ‌న్నీ, అక్క‌డే హాలీవుడ్ ప్రాజెక్టు గురించి మాట్లాడాడ‌ట‌. సూప‌ర్ ఫ్రాంఛైజీ హీరో స‌బ్జెక్ట్ కావ‌డంతో ఇమీడియేట్‌గా ఓకే చెప్ప‌కుండా, కూసింత టైమ్ కూడా అడిగాడ‌ట‌. ఇంకొక్క సారి ఆలోచించుకుని చెప్తాన‌ని హాలీవుడ్ మేక‌ర్స్ ని నొప్పించ‌కుండా మాటిచ్చాడ‌ట‌.
ఆల్రెడీ ఇప్పుడు ఫామ్‌లో ఉన్న హీరోల్లో హాలీవుడ్ సినిమా చేసింది ఎవ‌ర‌య్యా అంటే చ‌టుక్కున గుర్తొచ్చే పేరు ధ‌నుష్‌. ఇప్పుడు బాలీవుడ్ రేంజ్‌లో సౌండ్ చేస్తున్న పుష్ప‌రాజ్ క‌నుక‌, హాలీవుడ్‌లో రెక్క‌లు విప్పితే ఆ జోష్ ఇంకో రేంజ్‌లో ఉండ‌బోతుందంటున్నారు ఫ్యాన్స్.
పుష్ప‌2 ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా చాలా వ‌ర‌కు పూర్త‌య్యాయి. పుష్ప ది రూల్‌లో అస‌లు త‌గ్గేదేలే అనే మేన‌రిజ‌మ్ వాడుతాడ‌ట బ‌న్నీ. ర‌ష్మిక రోల్ శ్రీవ‌ల్లిగా ఎలాగూ టాప్ లేపుతుంది. ప్రియ‌మ‌ణికి కూడా స్పెష‌ల్ రోల్ ఉంద‌ట ఈ వెర్ష‌న్‌లో. ఎటొచ్చీ ఫాహ‌ద్ ఫాజిల్‌, అల్లు అర్జున్ మ‌ధ్య ఢీ అంటే ఢీ అనే పోటీ చూడ‌టానికి ఫ్యాన్స్ వెయిటింగ్‌.

Related Posts