లైగ‌ర్ ప‌క్క‌కు జ‌రిగాడు… నెక్స్ట్ టోకెన్ విక్ర‌మ్‌దే!

అస‌లే నార్త్ సినిమాలు మినిమ‌మ్ క‌లెక్ష‌న్లు కూడా లేకుండా ప‌క్క‌కు జ‌రుగుతున్నాయి. ఈ టైమ్‌లో రిలీజ్ అవుతున్న సౌత్ సినిమాల సినారియో ఎలా ఉండబోతోంది? అదే ఆత్రుత అంద‌రిలోనూ ఉంది. లైగ‌ర్ రిలీజ్ కోసం టోట‌ల్ ఇండియా అంతే ఈగ‌ర్‌గా వెయిట్ చేసింది. రిలీజ్ డే తెల్లారుజామున కాస్త పాజిటివ్ సౌండే వినిపించినా, టైమ్ గ‌డిచేకొద్దీ లైగ‌ర్ మీద గ‌ట్టి ట్రోలింగ్ మొద‌లైంది. బా బా బాలేదు అంటూ నెగ‌టివ్ టాక్ స్ప్రెడ్ అయింది. ఇక సోష‌ల్ మీడియాలో ఎవ‌రికి న‌చ్చిన‌ట్టు వాళ్లు రాయ‌డం మొద‌లుపెట్టేశారు. ఓవ‌రాల్‌గా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర విజ‌య్ దేవ‌ర‌కొండ యావ‌రేజ్ టాక్ కూడా తెచ్చుకోలేక‌పోయాడు.
సో ఈ వీక్ వ‌చ్చిన విజ‌య్ లైగ‌ర్‌ని ప‌క్క‌న‌పెడితే, నెక్స్ట్ వీక్ వ‌చ్చే విక్ర‌మ్ కోబ్రా మీద కాన్‌సెన్‌ట్రేట్ చేస్తున్నారు జ‌నాలు. రీసెంట్‌గా హెల్త్ అప్‌సెట్ అయి హాస్పిట‌లైజ్డ్ అయ్యాడు విక్ర‌మ్‌. అక్క‌డి నుంచి తిరిగి రాగానే కోబ్రా ప్ర‌మోష‌న్స్ లో పార్టిసిపేట్ చేశాడు.
అంటే విక్ర‌మ్ ఎంత ప్యాష‌న్‌తో కోబ్రా సినిమా చేశాడో అర్థం చేసుకోవ‌చ్చు. ఒక‌టి కాదు, రెండు కాదు ఏకంగా 25 గెట‌ప్పుల్లో యాక్ట్ చేశాడు విక్ర‌మ్‌. క‌మ‌ల్‌హాస‌న్‌, సూర్య‌లాంటి వాళ్లు ఇంత‌కు ముందు లెక్క‌లు మిక్కిలి గెట‌ప్పులు ట్రై చేశారు. కానీ 25 గెట‌ప్పుల్లో చేయ‌లేదు. ఈసారి ట్రై చేశాడు విక్ర‌మ్‌. ఎక్క‌డా తాను విక్ర‌మ్ అని తెలియ‌కుండా జాగ్ర‌త్త‌పడుతూ మేక‌ప్‌కి అన్నేసి గంట‌లు ఖ‌ర్చు చేయ‌డం మామూలు విష‌యం కాదు. అజయ్ జ్ఞాన‌ముత్తు డైర‌క్ట్ చేసిన కోబ్రాలో మ్యాథ్స్ జీనియ‌స్‌గా న‌టించాడు విక్ర‌మ్‌. ఆయ‌న చేసే నేరాలు, అందులో నుంచి త‌ప్పించుకోవ‌డానికి చేసే ప్ర‌య‌త్నాలు, అందులో భాగంగా వేసే గెట‌ప్పులు జ‌నాల‌కు ఇంట్ర‌స్టింగ్‌గా ఉన్నాయి. త‌మిళ్‌, తెలుగు, సౌత్ లాంగ్వేజెస్‌తో పాటు నార్త్ లోనూ రిలీజ్ అవుతోంది కోబ్రా. కాశ్మీరీ ఫైల్స్, పుష్ప‌, కార్తికేయ‌2లాగా సైలెంట్ హిట్ అవుతుందేమో చూడాలి.