ఫ్యామిలీ తో పుకెట్‌కి వెళ్తున్న యంగ్ హీరో ?

ఫ్యామిలీ మెంబ‌ర్స్ కోరుకునేటంత టైమ్ ఇవ్వ‌గ‌లిగిన రంగాల్లో అంద‌రూ ఉండ‌క‌పోవ‌చ్చు. చేస్తున్న ప‌ని వ‌ల్ల కొన్నాళ్ల పాటు కుటుంబ‌స‌భ్యుల‌కు దూరంగా ఉండాల్సి రావ‌చ్చు. కానీ అప్పుడ‌ప్పుడైనా ప‌ని నుంచి ప‌క్క‌కు జ‌రిగి ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. లేకుంటే సంపాదించే డ‌బ్బు, సాధించే స‌క్సెస్‌కి అర్థం లేకుండా పోతుంది. ఈ విషయాన్ని ఇప్పుడిప్పుడే అవ‌గాహ‌న చేసుకుంటున్నాడు హీరో నిఖిల్‌. రీసెంట్‌గా కార్తికేయ‌2తో స‌క్సెస్ సాధించాడు నిఖిల్‌.


కార్తికేయ‌2 సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్, ప్రీ రిలీజ్ ప్ర‌మోష‌న్స్, పోస్ట్ ప్ర‌మోష‌న్స్ తో ఫ్యామిలీకి అస‌లు టైమ్ కేటాయించ‌లేక‌పోయాడ‌ట నిఖిల్‌. ఈ రీజ‌న్‌తో ఆయ‌న భార్య కోపంగా కూడా ఉంద‌ట‌. ఆమెను కూల్ చేయ‌డానికే పుకెట్ ఐలాండ్‌కి తీసుకెళ్తున్నాడు హీరో.
వెస్ట‌ర్న్ షోర్‌లో క్లీన్ వాట‌ర్స్ తో మెస్మ‌రైజ్ చేసే బీచ్‌ల‌కు వెళ్ల‌డం త‌న‌కు కూడా ఇష్ట‌మే అంటున్నాడు నిఖిల్‌. కార్తికేయ‌2 సినిమా స‌క్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నాన‌ని చెబుతూనే, ఆ సినిమా త‌న‌పై మ‌రింత బాధ్య‌త పెట్టింద‌ని చెప్పాడు ఈ హీరో. త‌న‌ది నాన్ ఫిల్మీ బ్యాక్ గ్రౌండ్ కావ‌డం వ‌ల్ల‌, కెరీర్ స్టార్టింగ్‌లో త‌న‌ను గైడ్ చేసే వాళ్లు లేర‌ని, ఒక‌వేళ ఉంటే ఒడుదొడుకులు అన్ని ఉండేవి కాద‌నీ అన్నాడు.
ఏ సినిమా స‌క్సెస్‌కైనా కీ క‌థే. అలాంటి స్ట్రాంగ్ స్టోరీ దొరికిన ప్ర‌తిసారీ నిఖిల్‌కి హిట్ వ‌చ్చింది. ప్యాన్ ఇండియా రేంజ్‌లో ఇప్పుడు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటున్న‌ది కూడా క‌థా బ‌లం ఉన్న సినిమాలే. ట్రిపుల్ ఆర్‌, కేజీయ‌ఫ్‌2 వంటివ‌న్నీ అలాంటి సినిమాలేన‌ని చెప్పాడు నిఖిల్‌. త‌న అకౌంట్‌లో ఇప్పుడు న్యూ సెక్ష‌న్ ఆఫ్ ఆడియ‌న్స్ యాడ్ అయ్యార‌ని, వారిని ఎట్టిప‌రిస్థితుల్లోనూ డిస‌ప్పాయింట్ చేయ‌ని విధంగా క‌థ‌ల‌ను సెల‌క్ట్ చేసుకుంటాన‌ని అన్నాడు నిఖిల్‌. కార్తికేయ‌2 ఇచ్చిన కాన్పిడెన్స్ తోనే 18 పేజెస్‌, స్పై సినిమాల ప్ర‌మోష‌న్ల‌ను ప్లాన్ చేసుకుంటున్నాడు హ్యాపీ హ్యాపీగా.

Related Posts