దసరా కానుకగా రానున్న ‘గేమ్ ఛేంజర్’

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, భారీ చిత్రాల దర్శకుడు శంకర్ కలయికలో రూపొందుతోన్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. కనీవినీ ఎరుగని ఈ క్రేజీ కాంబో సెట్టవడం.. షూటింగ్ జరుపుకోవడం.. జరుగుతూనే ఉంది. కానీ.. ‘గేమ్ ఛేంజర్’ ఎప్పుడు విడుదలవుతోంది? అనేదే మిలియన్ డాలర్స్ క్వశ్చన్ గా మిగిలింది. శంకర్ కిట్టీలో ‘ఇండియన్ 2’ కూడా ఉండడంతో ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ నత్తనడకన సాగుతోంది.

ఇప్పటికే మేజర్ పార్ట్ చిత్రీకరణ పూర్తిచేసుకున్న ‘గేమ్ ఛేంజర్’ కొత్త షెడ్యూల్ త్వరలో మొదలవ్వనుందట. మొత్తానికి.. జూన్ వరకూ ఈ సినిమాలో రామ్ చరణ్ కు సంబంధించిన పోర్షన్ షూటింగ్ కంప్లీట్ అవుతుందట. ఆ తర్వాత మిగతా ప్యాచ్ వర్క్ పూర్తి చేసి దసరా కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలనేది శంకర్ ప్లాన్ అట. ఎందుకంటే ఈ సినిమాకి పేరుకు నిర్మాత దిల్ రాజు అయినా.. డెసిషన్ మేకర్ మాత్రం డైరెక్టర్ శంకర్ మాత్రమే. అది దిల్ రాజు కూడా చెప్పిన మాట. మరోవైపు గత ఏడాదే విడుదలవ్వాల్సిన ఈ సినిమాలోని ‘జరగండి జరగండి’ పాటను త్వరలో రిలీజ్ చేసే సన్నాహాల్లో ఉందట టీమ్.

Related Posts