ఒమిక్రాన్ దెబ్బకు ఫస్ట్ మూవీ డౌన్

కరోనా .. ఈ మాట విని జనమంతా భయంతో వణికిపోయారు. కాస్త రిలాక్సేషన్ రాగానే మళ్లీ ఏ మాత్రం జాగ్రత్తలు తీసుకోకుండా ఎప్పట్లానే ఓ రేంజ్ లో జాతరలు మొదలుపెట్టారు. ఇది మన దేశంలోనే కాదు. ప్రపంచ దేశాలన్నిటిలోనూ కనిపించిన నిర్లక్ష్యం. ఆ నిర్లక్ష్యాన్ని మరోసారి మూల్యం చెల్లించాల్సిందే అంటూ ఇప్పుడు ఒమిక్రాన్ అంటూ కొత్త వేరియంట్ మొదలైంది. ఇప్పటికే యూరప్ దేశాను వణికిస్తోన్న ఒమిక్రాన్ మన దేశంలో కూడా చాపకింద నీరులా విస్తరిస్తోంది. అయినా మనవాళ్లు ఇంకా సీరియస్ గా తీసుకోవడం లేదు. కానీ కొన్ని రాష్ట్రాల్లో ఆల్రెడీ నైట్ కర్ఫ్యూ పెట్టేశారు. ఢిల్లీ, కర్ణాటకతో పాటు త్వరలోనే మహరాష్ట్రలో కూడా రాత్రి కర్ఫ్యూకి రంగం సిద్ధమైంది. దీంతో త్వరలో విడుదల కాబోతోన్న సినిమా పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఇప్పటికే చాలా సినిమాలు పోస్ట్ పోన్ అవుతాయి అని వస్తోన్న వార్తలు ఇండస్ట్రీలను భయపెడుతున్నాయి. ముఖ్యంగా త్వరలోనే దేశవ్యాప్తంగా క్రేజ్ ఉన్న ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ వంటి చిత్రాలున్నాయి. వీటి సంగతేమో కానీ ఫస్ట్ వికెట్ గా ఓ బాలీవుడ్ మూవీ తమ సినిమాను వాయిదా వేసింది.
తెలుగులో సూపర్ హిట్ అయిన జెర్సీ చిత్రాన్ని హిందీలో అదే పేరుతో అదే దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించాడు. షాహిద్ కపూర్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని ఈ నెల 31న విడుదల చేస్తున్నాం చాలా రోజుల క్రితమే ప్రకటించారు. బట్ ఇప్పుడు ఒమిక్రాన్ భయానికి థియేటర్స్ మళ్లీ 50శాతం ఆక్యుపెన్సీ అంటారు. పైగా నైట్ కర్ఫ్యూ అంటే కేవలం మూడు షోస్ కు మాత్రమే అనుమతి ఉంటుంది. అలా అయితే తమ చిత్రం నష్టపోవడం గ్యారెంటీ అునకునే ఈ నిర్ణయం తీసుకున్నారట. సో.. ఫస్ట్ వికెట్ గా జెర్సీ పడిపోయింది. మరి నెక్ట్స్ ఎవరో..?

Related Posts