పుష్ప -2 రిలీజ్ డేట్ ఫిక్స్

పుష్ప పార్ట్ వన్ సూపర్ హిట్ కావడంతో ఎంటైర్ టీమ్ మంచి జోష్ లో ఉంది. అల్లు అర్జున నటనతో గట్టెక్కిన ఈ చిత్రంలో సుకుమార్ టేకింగ్ నెక్ట్స్ లెవెల్ లో కనిపించిందంతే. రష్మిక మందన్నా గ్లామర్, చాలా బోల్డ్ గా ఉన్న సమంత ఐటమ్ సాంగ్ కూడా కలిసొచ్చాయి. దేవీ శ్రీ ప్రసాద్ పాటలు బావున్నా.. నేపథ్య సంగీతం విషయంలో కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి. మరి ఈ సారి వాటిని సరి చేసుకుంటారా లేదా అనేది చెప్పలేం. బట్.. ఇక ఈ చిత్రానికి మరో పార్ట్ కూడా ఉంటుందని అందరికీ తెలుసు కదా. ఇప్పుడా రెండో భాగం రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేసుకుముంది మూవీ టీమ్.
పుష్ప కు సంబంధించి ఈ రోజు(మంగళవారం)తో సంబరాలను ముగించుకున్నారు. ఈ క్రమంలో తమ జర్నీని తలచుకుని అంతా ఎమోషనల్ అయ్యారు కూడా. ఈ రోజు నుంచి ఇక ఈ చిత్రానికి సంబంధించి సక్సెస్ సెలబ్రేషన్స్ ఏం కనిపించవన్నమాట. ఇక తర్వాతి పార్ట్ పై కాన్ సెంట్రేట్ చేయబోతున్నారు. నిజానికి పుష్ప సెకండ్ పార్ట్ కు సంబంధించి ఆల్రెడీ 30 పర్సెంట్ షూటింగ్ గతంలోనే పూర్తి చేశారు. అంటే ఫస్ట్ పార్ట్ లో చిత్రీకరించిన చాలా సీన్స్ ను ఈ పార్ట్ లో వాడబోతున్నారు. అంటే మిగిలింది 70శాతం మాత్రమే. ఈ మొత్తాన్ని కేవలం 100 రోజుల్లోనే పూర్తి చేయాలని అల్లు అర్జున్ డెడ్ లైన్ పెట్టేశాడట. అందుకు కారణం సుకుమార్ చిత్రీకరణ శైలి చాలా నెమ్మదిగా ఉంటుంది. అందుకే కాస్త వేగం పెంచి వంద రోజుల్లోనే పూర్తి చేస్తే తర్వాత ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నా చేసుకోవచ్చు. లేదంటే పుష్ప చిత్రాన్ని అలా టైమ్ లేక మొదటి రోజు సరైన సౌండ్ మిక్సింగ్ లేకుండానే విడుదల చేయాల్సి వచ్చింది.
ఇక షూటింగ్ తో పాటు రిలీజ్ డేట్ ను కూడా పక్కాగా ప్లాన్ చేసుకుంది పుష్ప టీమ్. ఈ చిత్రం అంటే ‘పుష్ప ది రూల్’ను 2022 దసరా బరిలో విడుదల చేయబోతున్నారట. ఈ మేరకు టీమ్ సరైన ప్లానింగ్ తోనే వెళుతోందట. సో.. పుష్ప ది రూల్ వచ్చే దసరా నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట.