ఎక్స్ క్లూజివ్.. పుష్ప 2 కథేంటో తెలుసా..?

పుష్ప 2  తెలుగు సినిమా పరిశ్రమలో చాలాకాలం తర్వాత వచ్చిన రా అండ్ రస్టిక్ మూవీగా తిరుగులేని విజయం అందుకుంది తెలుగు సినిమా పరిశ్రమలో చాలాకాలం తర్వాత వచ్చిన రా అండ్ రస్టిక్ మూవీగా తిరుగులేని విజయం అందుకుంది. ఈ మూవీతో అల్లు అర్జున్ రేంజ్ కూడా నేషనల్ వైడ్ గా పెరిగింది. మార్కెట్ తో పాటు క్రేజ్ కూడా వచ్చింది. సినిమాతో పాటు పాటలు కూడా ఓ ఊపేశాయి. పుష్ప కథగా చూస్తే కలప స్మగులింగ్ గా కనిపించినా.. అంతర్లీనంగా తండ్రి ద్వారా వచ్చే గుర్తింపు కోసం తాపత్రపడే ఓ కాన్ ఫ్లిక్ట్ కూడా కనిపిస్తుంది. పెళ్లి చేసుకోకుండా తల్లి అయినా ఓ తల్లి కొడుకుగా తన తండ్రి ఎవరో తెలిసి కూడా చెప్పుకోలేని నిస్సహాయత్వం నుంచి ఓ మొండితనం చూపించే పుష్పరాజ్ కథ ఇది. ఆ మొండితనం నుంచే తనకు ఏం లేదో దాన్ని సంపాదిస్తూ.. మొదటి భాగంలో కలప స్మగులింగ్ డాన్ గా “రైజ్” అయ్యాడు. తర్వాతి భాగంలో తన సామ్రాజ్యాన్ని దేశవ్యాప్తంగా విస్తరించి రూల్ చేస్తాడు అని హింట్ ఇచ్చారు. కానీ మొదట్లో ఈ సెకండ్ పార్ట్ అనుకోలేదు. అయినా ఇప్పుడు కథ సిద్ధం చేసుకున్నారు. ఈ కథలో కూడా అంతర్లీనంగా ఓ సెంటిమెంట్ తో కూడిన కాన్ ఫ్లిక్ట్ ఉండేలా చూసుకున్నారు. అందుకే ఈ కథ గురించి కీలకంగా వినిపిస్తున్నదేంటో చూద్దాం..

పుష్పరాజ్ గా దేశం మొత్తం కలప స్మగులింగ్ లో డాన్ అవుతాడు. అతన్ని పట్టుకోవడానికి షెకావత్(ఫహాద్ ఫాజిల్) వ్యక్తిగతంనూ కక్ష తీర్చుకోవాలని చూస్తుంటాడు. ఓ రకంగా ఈ ఇద్దరి మధ్యే రసవత్తరమైన ఛేజింగ్ జరుగుతూ ఉంటుంది. కానీ అప్పటికే పెద్ద డాన్ లా ఎదిగిన పుష్పరాజ్ ను పట్టుకునేందుకు తన శక్తి సరిపోదు. అందుకే పుష్పరాజ్ తండ్రి మొదటి భార్య సంతానం(అజయ్ అండ్ టీమ్) హెల్ప్ తీసుకుంటాడు. మరోవైపు జాలిరెడ్డి కూడా పుష్పరాజ్ తో పాటు అతని భార్యపైనా పగ తీర్చుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. అటు పుష్పరాజ్ సామ్రాజ్యం ఓ స్థాయిలో విస్తరిస్తూ పోతుంది. తనకు ఎదురులేదు అనే అహంకారం కూడా అతనిలో మొదలవుతుంది. ఆ టైమ్ లోనే భార్యను కూడా కొంత నిర్లక్ష్యం చేస్తాడు. ఇదే అదనుగా షెకావత్ అజయ్ హెల్ప్ తో శ్రీ వల్లిని జాలిరెడ్డికి పట్టిస్తాడు. ఆమె ద్వారా పుష్పరాజ్ ను చంపాలని ప్లాన్ చేసిన జాలిరెడ్డికి చిక్కినా అతని లక్ష్యం నెరవేరకూడదని.. శ్రీ వల్లి ఆత్మహత్య చేసుకుంటుంది. అక్కడి నుంచి పుష్పరాజ్ లో అహం దిగిపోతుంది. తన సామ్రాజ్యాన్ని తనే విచ్ఛిన్నం చేసుకుని శ్రీ వల్లి చావుకు కారణమైన జాలిరెడ్డి, షెకావత్ లను చంపేసి తను లొంగిపోతాడు.
ఇదీ పుష్ప2 కథ. అల్లు అర్జున్ లొంగిపోతున్నప్పటికే అతనికి ఒక కొడుకు ఉంటాడ. అతని ద్వారా మరో పార్ట్ కూ రంగం సిద్ధం చేసుకునేలా సుకుమార్ ప్లాన్ చేసుకున్నాడట. మొత్తంగా ఈ రెండో భాగం కథ కూడా ఆకట్టుకునేలానే ఉంది. మరి స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేస్తే.. మరో బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అనుకోవచ్చు.

Telugu 70mm

Recent Posts

Kamal-Shankar’s ‘Indian’ movie is 28 years old

The film 'Indian' came out with the story of how an Indian who fought heroically…

13 hours ago

‘కన్నప్ప‘ సెట్స్ లోకి అడుగుపెట్టిన ప్రభాస్

టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా లెవెల్ లో రాబోతున్న డివోషనల్ మూవీ 'కన్నప్ప'. అసలు రెబెల్ స్టార్ కృష్ణంరాజు వారసుడైన…

13 hours ago

Glimpses of Sai Pallavi’s birthday special from ‘Tandel’

Today (May 9) the team released special glimpses from the movie 'Tandel' on the occasion…

13 hours ago

కమల్-శంకర్ ‘ఇండియన్‘ మూవీకి 28 ఏళ్లు

స్వాతంత్ర్యోద్యమంలో వీరోచితంగా పోరాడిన ఓ భారతీయుడు.. స్వాతంత్ర్యానంతరం జరుగుతోన్న అవినీతిపై ఎలా ఉక్కు పాదం మోపాడన్న కథతో 'ఇండియన్' చిత్రం…

13 hours ago

Vijay Deverakonda came with three movie updates

Today (May 9) is rowdy star Vijay Deverakonda's birthday. On this occasion, the makers have…

13 hours ago

Natural Beauty Sai Pallavi Biography

Natural Beauty Sai Pallavi does movies selectively without accepting all the offers. She suddenly gave…

13 hours ago