అజిత్-ప్రశాంత్ నీల్ కాంబో.. మైత్రీ ప్లాన్

ప్రెజెంట్ డైరెక్టర్స్ లో రాజమౌళి, ప్రశాంత్ నీల్ లకు ఉన్న కల్ట్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. స్టార్ హీరోస్ కూడా వీళ్లతో వర్క్ చేయడానికి ఉత్సాహాన్ని చూపిస్తుంటారు. లేటెస్ట్ గా ‘సలార్’ సెన్సేషన్ ప్రశాంత్ నీల్ తో పనిచేయడానికి ఎంతో ఆసక్తిగా ఉన్నాడట తమిళ అల్టిమేట్ స్టార్ అజిత్. ఇక వీరిద్దరి కాంబోని సెట్ చేయడానికి టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌజ్ మైత్రీ మూవీ మేకర్స్ రంగంలోకి దిగుతోందట.

ఇప్పటికే ‘సలార్’ సినిమాని నైజాంలో రిలీజ్ చేసి.. డిస్ట్రిబ్యూటర్స్ గా బడా హిట్ ను తమ ఖాతాలో వేసుకోబోతుంది మైత్రీ సంస్థ. అలాగే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబోలో తామే నిర్మాతగా ఓ సినిమాని సెట్ చేసింది. తారక్ మూవీ తర్వాత ప్రశాంత్ నీల్ తో.. అజిత్ హీరోగా సినిమా చేయడానికి సన్నాహాలు జరుపుతుందట మైత్రీ సంస్థ. అయితే.. ‘ఎన్టీఆర్ మూవీ, సలార్ 2, కె.జి.యఫ్ 3’ సినిమాలే తర్వాత ప్రశాంత్ నీల్-అజిత్ కాంబినేషన్ మూవీ ఉండొచ్చనే ప్రచారం జరుగుతుంది.

Related Posts