”దృశ్యం” మూవీ అరుదైన రికార్డ్

ఒకప్పడు అంటే తెలియదు కానీ.. టెక్నాలజీ చేతిలోకే అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా ఇండియన్ సినిమాలు ఇతర దేశాల చిత్రాలకు కాపీగానో లేక.. ఇక ఇన్సిస్పిరేషన్ గానో కనిపిస్తున్నాయి. దీంతో ఒకప్పుడు అద్భుతం అనిపించిన సినిమాలే ఇప్పుడ కాపీల్లా కనిపిస్తున్నాయి. ఇక ఇండియన్ మూవీస్ లో ఎక్కువగా కొరియన్ సినిమాల నీడ కనిపిస్తుంది.

మామూలుగా కొరియన్ మూవీస్ అంటే వరల్డ్ లో ఎవరికీ తట్టని పాయింట్స్ తో కనిపిస్తుటాయి. కథా బలం చాలా ఉంటుంది. ఆర్టిస్టులంతా ఒకేలా కనిపించినా.. కొన్ని సినిమాలు మాత్రం కట్టిపడేస్తాయి. అందుకే మనవాళ్లు కొన్ని అఫీషియల్ గా, మరికొన్ని అనఫీషియల్ గా కొరియన్ మూవీస్ ను తీసుకుని రూపొందిస్తుంటారు. ఆ మధ్య వచ్చిన సమంత ఓబేబీ మూవీ కొరియన్ చిత్రానికి రీమేకే. రీసెంట్ గా వచ్చిన శాకినీ డాకినీ అనే చిత్రం కూడా కొరియన్ మూవీకి రీమేక్.

ఇక అనఫీషియల్ గా అయితే లెక్కేలేదు. కొన్నాళ్ల క్రితం వచ్చిన ఇండస్ట్రీ హిట్ పోకిరి చిత్రంలో చాలా సీక్వెన్స్ లు ఓ కొరియన్ మూవీ నుంచి ఇన్స్ స్పైర్ అయినవే. అలాంటి కొరియన్స్.. ఇప్పుడు మన దృశ్యం సినిమాను రీమేక్ చేయబోతున్నారంటే ఆశ్చర్యం కాక మరేంటీ..?
ఏదైనా కథలో దమ్ముంటేనే మిగతావన్నీ యాడ్ అవుతాయి. కథ బలహీనంగా ఉంటే ఎంత గొప్ప ఆర్ఆర్ ఉన్నా.. ఎంత గొప్ప నటులున్నా.. ఏం ఉపయోగం ఉండదు. దృశ్యంలో ఆ బలం ఉంది. అందుకే ఈ చిత్రాన్ని కొరియా వాళ్లు రీమేక్ చేస్తున్నారు. ఇండియా నుంచి కొరియన్స్ రీమేక్ చేస్తోన్న మొట్టమొదటి చిత్రం ”దృశ్యం” కావడం విశేషం.

మరో విశేషం ఏంటంటే.. అకాడెమీ అవార్డ్ తో పాటు అనేక అంతర్జాతీయ అవార్డ్స్ తో సత్తా చాటిన పారాసైట్ చిత్రంలో కీలక పాత్ర చేసిన సాంగ్ కాంగ్ హో అనే నటుడు ఈ రీమేక్ లో హీరోగా నటించబోతున్నాడు.

ఇక అక్కడ కూడా రెండు భాగాలూ వస్తాయట. బడ్జెట్ ను పెంచడంతో పాటు కథనంలో కొతలు కూడా ఉంటాయని టాక్.


మొత్తంగా మళయాలంలో జీతూ జోసెఫ్‌ తెరకెక్కించిన దృశ్యం ఇండియాలోని అన్ని భాషల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్లా ఘన విజయం సాధించింది. అలాగే చైనాలోనూ రీమేక్ అయితే అక్కడా సూపర్ హిట్ గా నిలిచింది. మరి కొరియా నుంచి ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.

Related Posts