ఈ శుక్రవారం ఎన్ని సినిమాలున్నాయో తెలుసా..

ప్రతి ఫ్రైడే కొత్త సినిమా పోస్టర్స్ తో థియేటర్స్ అన్నీ కళకళలాడుతుంటాయి. పెద్ద సినిమాలున్నప్పుడు తక్కువ సినిమాలు.. లేనప్పుడు ఎక్కువ సినిమాలు విడుదల కావడం ఎప్పుడూ జరిగేదే. అప్పుడప్పుడూ మాత్రం అదేదో క్లియరెన్స్ మాదిరిగా ఆరేడు సినిమాలు విడుదలవుతూ ఉంటాయి. వీటిలో మీడియం రేంజ్ నుంచి మినీ మూవీస్ వరకూ ఉంటాయి. వెల్ నోన్ ఆర్టిస్టుల నుంచి అసలు తెలియని వారి సినిమాల వరకూ వుంటాయి. అలా ఈ నెల 15, 16తేదీల్లో ఏకంగా ఏడు సినిమాలు విడుదల కాబోతున్నాయి. వీటిలో రెండు డబ్బింగ్ సినిమాలు కూడా ఉన్నాయి. మరి వీటిలో కాస్త ఎక్కువ తెలిసిన సినిమా అంటే ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మాత్రమే కనిపిస్తోంది. ఈ చిత్రం ఈ నెల 16న విడుదల కాబోతోంది. ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో సుధీర్ బాబు, కృతిశెట్టి జంటగా నటించారు. ఓ ఫిల్మ్ డైరెక్టర్ కీ, డాక్టర్ కీ మధ్య జరిగే కథగా కనిపిస్తోన్న ఈ మూవీ ట్రైలర్ కు ఇప్పటికే అద్భుతమైన స్పందన వచ్చింది.

ఆల్రెడీ ఇంద్రగంటి – సుధీర్ కాంబోలో ఇంతకు ముందు సమ్మోహనం అనే ఫీల్ గుడ్ లవ్ స్టోరీ వచ్చింది. ఆ మధ్య వి అనే యాక్షన్ ఎంటర్టైనర్ కూడా వచ్చింది. హ్యాట్రిక్ మూవీగా వస్తోన్న ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి రిజల్ట్ కోసం ఇండస్ట్రీ కూడా ఆసక్తిగానే చూస్తుండటం విశేషం.ఇక ఆ తర్వాత కనిపిస్తోన్న సినిమా నేను మీకు బాగా కావాల్సిన వాడిని. కోడి రామకృష్ణ కూతురు కోడి దివ్యదీప్తి నిర్మించిన ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరపు, సంజనా ఆనంద్ జంటగా నటించారు. ఎస్వీ కృష్ణారెడ్డి, బాబా భాస్కర్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. శ్రీధర్ గాదె దర్శకుడు. ఫ్యామిలీ, లవ్, ఎమోషనల్ ఎంటర్టైనర్ గా కనిపిస్తోన్న ఈ మూవీ ట్రైలర్ కూడా ఆకట్టుకునేలానే ఉంది. కిరణ్‌ కు చాలా క్రూసియల్ మూవీగా భావిస్తోన్న నేనుమీకు కావాల్సిన వాడిని 16నే విడుదలవుతోంది.ఈ రెండు చిత్రాలతో పాటు కాస్త వెల్ నోన్ మూవీ అంటే శాకినీ ఢాకినీయే ఉంది. రెజీనా కసాండ్రా, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఇది. సుధీర్ వర్మ దర్శకుడు.

సురేష్‌ బాబు, సునితా తాటి నిర్మించిన ఈ మూవీ మిడ్ నైట్ రన్నర్స్ అనే కొరియన్ మూవీకి అఫీషియల్ రీమేక్. లేటెస్ట్ గా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ సైతం ఆకట్టుకునేలానే ఉంది. ఇన్వెస్టిగేటివ్ యాక్షన్ ఎంటర్టైనర్ లా కనిపిస్తోన్న ఈ శాకినీ ఢాకినీ కూడా 16నే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఇవి కాక తెలుగు నుంచి అం అః, సకల గుణాభిరామ, నేను కేరాఫ్‌ నువ్వు వంటి చిత్రాలున్నాయి. అయితే తమిళ్ లో శింబు నటించిన వెందు తనింధతు కాడు అనే చిత్రాన్ని తెలుగులో ద లైఫ్‌ ఆఫ్‌ ముత్తు పేరుతో తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేయబోతున్నారు. స్రవంతి రవికిశోర్ తెలుగు అనువాద నిర్మాత. ఈ చిత్రాన్ని అందరికంటే ఒక రోజు ముందుగానే 15న రిలీజ్ చేస్తున్నారు.

ఈ మూవీకి అక్కడ మంచి టాక్ వచ్చింది. తెలుగు టీజర్ బానే ఉంది. చాలా రోజుల తర్వాత శింబు సినిమా తెలుగులో డబ్ అవుతుండటం విశేషం.ఇక మరో డబ్బింగ్ సినిమా కన్నడ నుంచి వస్తోంది. ఈగతో విలన్ గా ఫేమ అయిన సుదీప్ నటించిన ఈ చిత్రం కె3. 1990స్ లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బాషా చిత్రాన్ని 2001లో కోటిగుబ్బ అనే టైటిల్ తో కన్నడలో రీమేక్ చేశారు. ఈ మూవీలో విష్ణువర్థన్ హీరోగా నటించాడు. ఆ సిరీస్ లో తర్వాత భాగంలో సుదీప్ నటించాడు. అతనే ఈ మూడో పార్ట్ లోనూ కనిపించబోతున్నాడు. ఫస్ట్ మూవీ హిట్, రెండో భాగమూ హిట్. మరి ఈ మూడో పార్ట్ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో కానీ ఈ కె3 కూడా నెల 16నే తెలుగు ఆడియన్స్ ముందుకు వస్తోంది.మొత్తంగా ఈ ఏడు సినిమాలతో పాటు ఇంకా ఒకటీ అరా చిత్రాలు ఈ ఫ్రైడే బరిలో నిలిచే అవకాశాలున్నాయి. మరి వీటిలో విజయం ఎవరిని వరిస్తుందో..

Related Posts