జ‌నాలు ఈ చిన్న సినిమాలకు వెళ్తారా..?

అన్నీ అనుకున్న‌ట్టుగా జ‌రిగుంటే.. ద‌ర్శ‌క‌ధీరుడు సంచ‌ల‌న చిత్రం ఆర్ఆర్ఆర్ ఈ రోజు ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చుండేది. అయితే.. ఓమిక్రాన్ వ‌చ్చి ఆర్ఆర్ఆర్ కి షాక్ ఇచ్చింది. అంతే.. మ‌రోసారి ఆర్ఆర్ఆర్ వాయిదా ప‌డింది. దీంతో ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు అంద‌రూ డీలాప‌డ్డారు. ఆర్ఆర్ఆర్ వాయిదా ప‌డ‌డంతో చిన్న సినిమాలు థియేట‌ర్లోకి వ‌చ్చాయి.

ద‌గ్గుబాటి రానా నటించిన 1945 సినిమాను అలాగే ఆది సాయికుమార్ నటించిన అతిధి దేవోభవ సినిమాలను ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ అయిన జ‌న‌వ‌రి 7న విడుదల చేశారు. నేడు ఈ రెండు సినిమాలు విడుదల అయ్యాయి అంటే నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే… ఏమాత్రం హడావుడి కనిపించడం లేదు. ఆర్ ఆర్ ఆర్ సినిమా వచ్చి ఉంటే దేశ వ్యాప్తంగా సినిమా థియేటర్ల వద్ద హడావుడి మామూలుగా ఉండేది కాదు. తెల్లవారుజాము నుండి మొదలుకుని థియేటర్ల వద్ద హడావుడి ఓ రేంజ్ లో కనిపించేది కానీ.. ఈ సినిమా విడుదల సందర్బంగా తెలుగు రాష్ట్రాల్లో హడావుడి అయితే ఏమీ కనిపించడం లేదు.

ఆర్ఆర్ఆర్ వాయిదా ప‌డ‌డంతో డ‌ల్ గా ఉన్న ప్రేక్ష‌కులు ఈరోజు రిలీజ్ అయిన సినిమాల‌కు పాజిటివ్ గా టాక్ వ‌స్తే.. అప్పుడు
ఖచ్చితంగా సినిమా థియేటర్ల వద్ద జనాలు క్యూ కట్టే అవకాశం ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాను భారీగా ప్రమోట్ చేయడం కంటే మౌత్ పబ్లిసిటీతోనే ఎక్కువగా ఫలితం ఉంటుంది. ఆ మౌత్ పబ్లిసిటీ సినిమా హిట్ అయితే వస్తుంది. మరి ఈ రెండు సినిమాలు హిట్ టాక్ దక్కించుకుని ఆర్ఆర్ఆర్ సినిమాను మిస్ అయిన లోటును కొంతలో కొంత అయినా తీరుస్తుందేమో చూడాలి.

Related Posts