దొంగలకు సపోర్ట్ గా దిల్ రాజు..

కొన్ని ప్లాట్ ఫామ్స్ ను కొందరు రూల్ చేస్తుంటారు. అలాగే ఆ ప్లాట్ ఫామ్స్ లో కొన్ని కథలే రూల్ అవుతుంటాయి. మరికొన్ని రూయిన్ అవుతుంటాయి. ఏదైనా హ్యాండిల్ చేసేదాన్ని బట్టే రిజల్ట్ ఉంటుంది. అయితే కథల విషయంలో ఖచ్చితంగా ఉంటాడు అనే పేరు తెచ్చుకున్నాడు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. ఆయన క్యాంప్ నుంచి చాలామంది దర్శకులు, టెక్నీషియన్స్, కథలకులు వచ్చారు. వస్తున్నారు. ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో తిరుగులేని నిర్మాతగా రాణిస్తున్నాడు దిల్ రాజు. మరోవైపు డిస్ట్రిబ్యూటర్ గా, ఎగ్జిబిటర్ గానూ అదే స్థాయిలో దూసుకుపోతున్నాడు. ఈ పాండమిక్ లో కూడా డిస్ట్రిబ్యూటర్ గా కోట్ల రూపాయల లాభాన్ని చూశాడు. ఇదే టైమ్ లో ప్యాన్ ఇండియన్ రేంజ్ లో తన ప్రొడక్షన్ హౌస్ నూ విస్తరిస్తున్నాడు. రీసెంట్ గా తన తమ్ముడి కొడుకును ఆశిష్ ను హీరోగా పరిచయం చేస్తూ రూపొందించిన రౌడీబాయ్స్ పెద్దగా ఆకట్టుకోకపోయినా అతన్ని హీరోగా నిలబెట్టేంత వరకూ నిద్రపోడని అనుకోవచ్చు.
మొత్తంగా ఇప్పటి వరకూ సినిమా పరిశ్రమలోనే టాప్ ప్లేస్ లో ఉన్నాడు దిల్ రాజు. అలాంటి తను లేటెస్ట్ గా ఓటిటి ప్లాట్ ఫామ్ లోకి కూడా ఎంటర్ అవుతున్నాడు. అంటే తనేమీ కొత్త ప్లాట్ ఫామ్ క్రియేట్ చేయడం లేదు. కానీ ఆ కంటెంట్ ను ప్రొడ్యూస్ చేయబోతున్నాడు. హరీశ్ శంకర్ కథ, స్క్రీన్ ప్లే అందించిన ఓ సిరీస్ ను హరీశ్ తో పాటు సంయుక్తింగా నిర్మించబోతున్నాడు. ఈ సిరీస్ టైటిల్ ‘ఏటిఎమ్’. అంటే ఏటిఎమ్ దొంగల నేపథ్యంలో సాగే కథ. వరుసగా ఏటిఎమ్ లను చోరీ చేస్తూ వెళ్లే కొంతమంది యంగ్ స్టర్స్ నేపథ్యంలో రాసిన కథ అంటున్నారు. అయితే కేవలం దొంగల కథగా కాక అద్భుతమైన థ్రిల్లర్ గానూ సాగుతుందని చెబుతున్నారు. ఈ థ్రిల్లింగ్ ఎలిమెంట్సే కదా.. ఓటిటిలను బ్రతికించేది. నిర్మాతలను లాభాలు చూసేలా చేసేది. అందుకే దిల్ రాజు హరీశ్ కథపై నమ్మకంతో తనూ నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. మరి ఈ దొంగల కథతో ఎలాంటి రిజల్ట్ చూస్తాడో కానీ.. దిల్ రాజు వేసిన స్టెప్ మాత్రం తెలివైందే.
వెబ్ సిరీస్ లలోకి నేరుగా ఎంటర్ కాలేదు దిల్ రాజు. ఓ భాగస్వామిగా వస్తున్నాడు. ఇక్కడ సాధకబాధకాలు ఎలా ఉన్నాయో ఈ సిరీస్ తో తెలుసుకుంటాడు. అప్పుడు అవసరమైతే.. తనకు లాభాలు ఖచ్చితంగా వస్తాయి అని భావిస్తే డైరెక్ట్ గా రంగంలోకి దిగుతాడన్నమాట.

Related Posts