హే రామ్.. ఇప్పుడవసరమా షారుఖ్

కొన్ని సినిమాలను క్లాసిక్స్ గా చెప్పుకుంటాం. అలాంటి వాటిని అలా వదిలేయాలంతే. రీమేక్ లనీ, ఇంకేదో మేకులనీ చెడగొడితే వాటి ఒరిజినల్ ఫ్లేవర్ మిస్ అవుతుంది. అలాంటి క్లాసిక్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది ‘హేరామ్’. కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తూ.. నిర్మించి డైరెక్ట్ చేసిన సినిమా ఇది.2000 ఫిబ్రవరి 18న విడుదలై అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. ఓ రకంగా అనేక కాంట్రవర్శీస్ ను కూడా క్రియేట్ చేసింది. ముఖ్యంగా గాంధీ విధానాలపై ఈ సినిమా ఓ సెటైర్ లానూ కనిపిస్తుంది. హే రామ్ అనే మాటను ఎక్కువగా గాంధీ చనిపోతున్నప్పుడు తుపాకీ తూటా తగలగానే అన్నాడనే ఓ ప్రాపగాండా ఉంది. దాన్ని కూడా కమెంట్ చేసేలా ఈ సినిమా రూపొందింది. కమల్ హాసన్ నటన పతాక స్థాయిలో కనిపించే ఈ చిత్రానికి నాలుగు నేషనల్ అవార్డ్స్ రావడం విశేషంగా చెప్పాలి. అలాగే విమర్శకుల చేత విపరీతంగా ప్రశంసించబడింది. అయితే ఈ సినిమా కాంట్రవర్శీస్ వచ్చినంత పెద్దగా కమర్షియల్ సక్సెస్ రాలేదు. అయినా కమల్ హాసన్ బెస్ట్ వర్క్స్ లో ఒకటిగా ఓ క్లాసిక్ గా హే రామ్ ఎప్పటికీ నిలిచిపోతుంది. అలాంటి చిత్రాన్ని ఇప్పుడు రీమేక్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడు బాలీవుడ్ ఒకప్పటి బాద్ షా షారుఖ్ ఖాన్.
కొన్నాళ్లుగా షారుఖ్ ఖాన్ తన ఛరిష్మాను పూర్తిగా కోల్పోయాడు. తన ఘనమంతా గతం అయిపోయే పరిస్థితిలో ఉన్నాడంటే అతిశయోక్తి కాదు.పైగా రీసెంట్ గా తన కొడుకును కూడా డ్రగ్ కేస్ లో పట్టుకున్నారు పోలీస్ లు. అందులో నిజమెంత అనేది న్యాయస్థానం తేలుస్తుంది. మరోవైపు సినిమాలన్నీ డిజాస్టర్స్ అవుతున్నాయి. ప్రస్తుతం తమిళ్ డైరెక్టర్ అట్లీతో ఓ సినిమా చేస్తున్నాడు. నయనతార హీరోయిన్ గా నటిస్తోందీ చిత్రంలో.
అయితే తను ఇప్పుడు సడెన్ గా హే రామ్ మూవీ రీమేక్ రైట్స్ ను తీసుకుని వార్తల్లోకి కొత్తగా వచ్చాడు. ఇప్పటికే ఇండియాలో ఓ పార్టీ గాంధీ క్యారెక్టర్ ను బ్యాడ్ గా చూపిస్తోంది. దానికి సపోర్టింగ్ గా ఉండే చిత్రణ హే రామ్ చిత్రంలో కనిపిస్తంది. అయినా ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలనుకుంటున్నాడు అంటే షారుఖ్ మరోసారి కాంట్రవర్శీస్ ను కోరుకుంటున్నాడా.. లేక సదరు పార్టీకి ఫేవర్ గానే ఈ చిత్రాన్ని రూపొందించాలనుకుంటున్నాడా అనే అనుమానాలు కలగడం సహజం. ఏదేమైనా హే రామ్ లాంటి చిత్రాన్ని మళ్లీ గెలక్కపోవడమే ఉత్తమం అనేది చాలామంది చెప్పే మాట. మరి ఆ మాటలను ఈ కథానాయకుడు వింటాడా లేదా అనేది చూడాలి.

Related Posts