నాన్ స్టాప్ ఇంటెన్స్ యాక్షన్ తో ‘డెవిల్‘

కథల ఎంపికలో విలక్షణతను చూపించే కళ్యాణ్ రామ్.. ఈసారి ఆడియన్స్ ను బ్రిటీష్ ఇండియా కాలానికి తీసుకెళ్లబోతున్నాడు. కళ్యాణ్ రామ్ బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ గా కనిపించబోతున్న ‘డెవిల్‘ మూవీ నుంచి ట్రైలర్ రిలీజయ్యింది. అభిషేక్ నామా దర్శకనిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ మూవీ ట్రైలర్ ఆద్యంతం విజువల్ ట్రీట్ అందిస్తోంది.

బ్రిటీష్ వారి తరపున పనిచేసే ఏజెంట్ డెవిల్ క్యారెక్టర్ లో కళ్యాణ్ రామ్ కనిపించబోతున్నాడు. విజయ అనే ఓ మహిళ మర్డర్ కేసును పరిశీలించడానికి మద్రాసు నుంచి స్పెషల్ ఆఫీసర్ గా రావడం.. చివరకు ఆ కేసును అతను ఎలా చేధించాడు అనేదే ఈ ట్రైలర్ సారాంశం. అయితే.. ట్రైలర్ చివరిలో ‘విశ్వాసంగా ఉండటానికి.. విధేయతతో బతికేయడానికి కుక్కను అనుకున్నావురా? లయన్‘ అంటూ.. బ్రిటిషర్స్ పైనే అతను తిరుగబడినట్టు చూపించారు. ఓవరాల్ గా ‘డెవిల్‘ ట్రైలర్ విజువల్ ఫీస్ట్ అని చెప్పొచ్చు. ఈ మూవీలో నాన్ స్టాప్ ఇంటెన్స్ యాక్షన్ తో కళ్యాణ్ రామ్ అదరగొట్టబోతున్నట్టు అర్థమవుతోంది.

కళ్యాణ్ రామ్ కి జోడీగా సంయుక్త మీనన్ నటించిన ఈ సినిమాలో మాళవిక నాయర్, సీత, సత్య, అజయ్, షఫీ వంటి వారు ఇతర కీలక పాత్రలు పోషించారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. డిసెంబర్ 29న గ్రాండ్ లెవెల్ లో ‘డెవిల్‘ రిలీజ్ కు అవుతోంది. మరి.. ‘బింబిసార‘ తర్వాత ‘అమిగోస్‘తో ఆకట్టుకోలేకపోయిన కళ్యాణ్ రామ్.. ‘డెవిల్‘తో 2023కి ఘన వీడ్కోలు పలుకుతాడేమో చూడాలి.

Related Posts