ఎన్టీఆర్ పై మనసుపడ్డ ‘యానిమల్’ బ్యూటీ

రణ్ బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ‘యానిమల్’ ఇంకా బాక్సాఫీస్ ను కొల్లగొడుతూనే ఉంది. ఈ సినిమాలో హీరోగా రణ్ బీర్ కి ఎంత పేరొచ్చిందో.. కీలక పాత్రలో కనిపించిన త్రిప్తి డిమ్రి కూడా అంతే లైమ్ లైట్ లోకి వచ్చింది. పేరుకు ఈ మూవీలో హీరోయిన్ రష్మిక అయినా.. త్రిప్తి ఎక్కువ హైలైట్ అయ్యింది. అందుకు కారణం ఈ మూవీలో ఆమె పోషించిన బోల్డ్ క్యారెక్టర్. రణ్ బీర్ తో ఇంటిమేట్ సీన్స్ లో త్రిప్తి చెలరేగిపోయింది.

ప్రస్తుతం బాలీవుడ్ లో పలు క్రేజీ ఆఫర్స్ త్రిప్తిని వెతుక్కుంటూ వస్తున్నాయి. అయితే.. సౌత్ లో తాను ఏ హీరోతో నటించడానికి ఆసక్తి చూపిస్తుందనే ప్రశ్న లేటెస్ట్ ఇంటర్యూలో ఎదురైంది. అందుకు త్రిప్తి ఏమాత్రం తడుముకోకుండా.. ఎన్టీఆర్ తో నటించాలనేది తన కోరిక అంటూ మనసులోని మాటను బయటపెట్టింది. ప్రస్తుతం త్రిప్తి కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

Related Posts