బంగార్రాజుకు షాక్ ఇచ్చిన సిఎమ్ జగన్

అక్కినేని ఫ్యామిలీ స్టార్స్ నాగార్జున, నాగచైతన్య నటించిన బంగార్రాజుకు భారీ షాక్ ఇచ్చాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. యస్.. ఇప్పటి వరకూ సంక్రాంతికి పెద్ద సినిమాగా నిలబడి.. టికెట్ రేట్లు తగ్గినా ఫర్వాలేదు… మాకు ఓకే అని చెప్పిన నాగార్జున నిర్ణయానికి షాక్ ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడి థియేటర్స్ లో 50శాతం ఆక్యుపెన్సీ అనే నిబంధన పెట్టింది. ఒమిక్రాన్, కరోనా కేస్ లు పెరుగుతున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నమని ప్రకటించింది. ఇది నాగ్ అండ్ టీమ్ ఊహించనిది.
మామూలుగా బంగార్రాజు ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్ కాదు. ప్రాంతీయ సినిమా. పూర్తిగా తెలుగు వాసనలున్న సినిమా. పైగా ఆల్రెడీ సూపర్ హిట్ అయిన చిత్రానికి సీక్వెల్. అందుకే సంక్రాంతి బరిలో తమ చిత్రానికి పూర్తి స్థాయిలో ఆదరణ ఉంటుందనుకుందీ టీమ్. ఈ కారణంగానే నాగార్జున కూడా ఏపిలో తగ్గించిన టికెట్ రేట్స్ తో తనకేం ప్రాబ్లమ్ లేదని ధీమాగా చెప్పాడు. మరి ఇప్పుడు టికెట్ రేట్స్ తో పాటు ఏకంగా యాభైశాతం ప్రేక్షకులకే అనుమతి అంటే నాగ్ ఊహించిన దానిలో కూడా సగానికి పైగా నష్టం మొదలవుతుందనుకోవచ్చు.
తెలంగాణలో కూడా రేపో మాపో ఈ నిర్ణయం వెలువడొచ్చు. నిజానికి ఆంధ్రతో పోలిస్తే తెలంగాణలోనే ఎక్కువ కేస్ లు నమోదవుతున్నాయి. అయినా ఇక్కడి ప్రభుత్వం ఇంకా సీరియస్ గా ఈ విషయంపై దృష్టి పెట్టలేదు. ఆంధ్ర నిర్ణయం తీసుకుంది కాబట్టి.. ఇక తర్వాత తెలంగాణ వంతే అనుకోవచ్చు. అయితే ఇది కేవలం బంగార్రాజుకు మాత్రమే కాదు.. సంక్రాంతికి విడుదలవుతున్న ఇతర చిన్న సినిమాలకు కూడా తీరని నష్టాన్ని తెస్తుంది. మరి ఇంకా నాలుగు రోజులు టైమ్ ఉంది కాబట్టి.. వీళ్లలో ఎవరైనా వాయిదా వేసుకుంటారా లేక ధైర్యం చేసి సినిమాను విడుదల చేస్తారా అనేది చూడాలి.

Related Posts