HomeMoviesటాలీవుడ్మెగాస్టార్ తో 'నా సామిరంగ' దర్శకుడి జెర్సీ మూమెంట్

మెగాస్టార్ తో ‘నా సామిరంగ’ దర్శకుడి జెర్సీ మూమెంట్

-

మెగాస్టార్ చిరంజీవితో పనిచేయాలనుకోని నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎవరుంటారు. ఆ లిస్టులో ‘నా సామిరంగ’ దర్శకుడు విజయ్ బిన్నీ ఒకడు. కొరియోగ్రాఫర్ గా మంచి పేరు తెచ్చుకున్న విజయ్ బిన్నీ ‘నా సామిరంగ’తో దర్శకుడిగా మారాడు. ఈ సినిమాలో అతను కింగ్ నాగార్జునను చూపించిన విధానానికి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. భారీ కాన్వాస్ పై చిత్రీకరించిన ‘నా సామిరంగ’ను చాలా తక్కువ రోజుల్లో కంప్లీట్ చేసి తన డైరెక్షన్ టాలెంట్ తో అందరినీ షాక్ కి గురి చేశాడు విజయ్ బిన్నీ.

లేటెస్ట్ గా ‘విశ్వంభర’లోని ఓ పాటకు కొరియోగ్రఫీ చేశాడట విజయ్. దీంతో డ్రీమ్ కమ్ ట్రూ అంటూ ‘జెర్సీ’ చిత్రంలో నాని ఫేమస్ మూమెంట్ ను షేర్ చేస్తూ తన ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. మరి.. ‘విశ్వంభర’లో విజయ్ బిన్నీ కొరియోగ్రాఫ్ చేసిన సాంగ్ ఏంటి? అందులో ఎవరెవరు ఉంటారు? అనే విషయాలు తెలియాల్సి ఉంది. వశిష్ట దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ నిర్మిస్తున్న ‘విశ్వంభర’ సంక్రాంతి కానుకగా విడుదలకు ముస్తాబవుతోంది.

ఇవీ చదవండి

English News