పులి పులి జెండా నీడలో పోరాడమంటోన్న చోళ రాజు

మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్1 వస్తోంది. భారీ తారాగణంతో ఉన్న ఈ మూవీ పీరియాడిక్ హిస్టారికల్ మూవీగా రాబోతోంది. ఒకప్పటి తమిళనాడు ప్రాంతంలోని రాజులు, రాజ్యాల నేపథ్యంలో వస్తోంది. ఇప్పటికీ అక్కడ చోళ రాజులపై పూజ్యనీయమైన గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని ఎలివేట్ చేస్తున్నారా.. లేక ఆ రాజ్యంలో జరిగిన కొన్ని సంఘటనలను పిక్చరైజ్ చేస్తున్నారా అనేది తెలియదు కానీ.. ఇప్పటికైతే ఈ చిత్రంపై అంచనాలు పెంచారు. బట్ కేవలం ఒక ప్రాంత రాజు కథ కాబట్టి మన సైరా లా ఇతర భాషల్లో కనెక్ట్ కాకపోవచ్చు అనే డౌట్స్ ఉన్నాయి. అయినా మణిరత్నం దర్శకుడు కాబట్టి.. ఖచ్చితంగా చూస్తారు అనే నమ్మకమూ ఉంది.ప్రస్తుతానికి విక్రమ్, ఐశ్వర్య రాయ్, కార్తీ, త్రిష ప్రధానంగా కనిపిస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందిస్తున్నాడు మణి.

ఇందులో మొదటి భాగం సెప్టెంబర్ 30న దేశవ్యాప్తంగా విడుదల కాబోతోంది. దీంతో ఇప్పటి నుంచే ప్రమోషనల్ వీడియోస్ ను రిలీజ్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. ఆ మధ్య విడుదలైన టీజర్ బానే ఉందనిపించుకుంది. లేటెస్ట్ గా అన్ని భాషల్లోనూ ఒకేసారి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి వచ్చిన ఈ పాట ట్యూన్ ఏమంత గొప్పగా లేదనే చెప్పాలి. తెలుగులో అనంత్ శ్రీరామ్ రాయగా మనో, అనురాగ్ కులకర్ణి పాడారు.”పెదపెద పులి ఏ చోటనా కూర్చోదురా చోళా చోళా.. బెదరని పులి నెగ్గేసినా తగ్గేయదు రా నీలా నీలా..” అంటే సాగే ఈ పాట ఓ యుద్ధ సమయంలో సైనికుల్లో దైర్యాన్ని నింపే సందర్భంలో వచ్చే పాటలా కనిపిస్తోంది. పాట ఆసాంతం తమిళ్ వాసన కనిపిస్తోంది. మరి తెలుగు ఆడియన్స్ కు ఎలా కనెక్ట్ అవుతుందో చూడాలి.

Related Posts