అమెరికాలో సందడి చేస్తోన్న చిరంజీవి, వెంకటేష్

ఇటీవల ప్రేమికులరోజు సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ సతీసమేతంగా అమెరికా బయలుదేరారు మెగాస్టార్ చిరంజీవి. మరి.. మెగాస్టార్ అమెరికా వెళ్లడం వెనుక కారణం ఏంటి? వెకేషన్ కోసమేనా ఆయన అమెరికా వెళ్లారా? అనే ఊహాగానాలు వినిపించాయి. అది.. ఇప్పుడు చిరు అమెరికా వెళ్లడం వెనుక అసలు కారణం బయటకు వచ్చింది.

చిరంజీవి మాత్రమే కాదు.. విక్టరీ వెంకటేష్ కూడా సతీసమేతంగా అమెరికాలో సందడి చేస్తున్నాడు. వీరితో పాటు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, మైత్రీ మూవీ మేకర్స్ అధినేతల్లో ఒకరైన నవీన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టి.జి.విశ్వప్రసాద్ కూడా అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో కలిసి సందడి చేస్తోన్న ఫోటోలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

వీరంతా అమెరికాలో కలుసుకోవడానికి కారణం.. చిరంజీవి ప్రియ మిత్రుడు ఎన్అర్ఐ కుమార్ కోనేరు గారి కుమారుడు కిరణ్ కోనేరు, శైల్య శ్రీల వివాహ వేడుకల్లో పాల్గొనడం కోసమే. ఈ వేడుకలో చిరంజీవి, సురేఖా దంపతులు, వెంకటేష్ దంపతులతో పాటు అల్లు అరవింద్, నవీన్, టి.జి.విశ్వప్రసాద్ కలిసున్న ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి.

Related Posts