యాడ్స్ కోసమే యాక్షన్ లో ఇరగదీశారు

టాలీవుడ్ హీరోస్ లో యాక్షన్ లో కుమ్మేసే కథానాయకులెవరంటే మహేష్ బాబు, అల్లు అర్జున్ పేర్లు ఖచ్చితంగా చెప్పాలి. సినిమాల వరకే కాదు ఈ హీరోలిద్దరూ ఇప్పుడు అడ్వర్ టైజ్ మెంట్స్ లోనూ యాక్షన్ ను పీక్స్ లో చూపిస్తున్నారు. లేటెస్ట్ గా రిలీజైన మహేష్ బాబు మౌంటేన్ డ్యూ యాడ్ లో న్యూ లుక్ తో మెస్మరైజ్ చేస్తూనే యాక్షన్ లో ఇరగదీశాడు మహేష్. ‘మొనగాడురా.. భయపడడురా..!’ అనే ట్యాగ్ లైన్ తో వచ్చిన ఈ యాడ్.. విపరీతంగా ఆకట్టుకుంటుంది.

మరోవైపు అల్లు అర్జున్ కూడా కొత్త యాడ్ తో సందడి చేస్తున్నాడు. తగ్గేదే లే అన్న రీతిలో ‘పైపు లీక్ అయ్యేదే లే!’ అంటూ ఆస్ట్రాల్ పైప్ యాడ్ తో అదరగొడుతున్నాడు. సరికొత్త యాక్షన్ ట్రీట్ అందిస్తున్న మహేష్, అల్లు అర్జున్ యాడ్స్ ఇప్పుడు ట్రెండింగ్ లో దూసుకెళ్తున్నాయి.

Related Posts