డిటెక్టివ్‌ సినిమాల్లో భూతద్దం భాస్కర్‌నారాయణ్ డిఫరెంట్‌ మూవీ : శివ కందుకూరి

శివ కందుకూరి, రాశీ సింగ్‌ జంటగా.. పురుషోత్తం రాజ్ డైరెక్షన్‌లో స్నేహాల్‌, శశిధర్‌ లు నిర్మించిన మూవీ భూతద్దం భాస్కర్‌నారాయణ. మార్చి 1న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపధ్యంలో హీరో శివ కందుకూరి విలేకరుల సమావేశంలో భూతద్ధం భాస్కర్ నారాయణ విశేషాలని పంచుకున్నారు.
భూతద్ధం భాస్కర్ నారాయణ కథ విన్నాను. ఇందులో ఒక మైథాలజీ ఎలిమెంట్ వుంది. మునుపెన్నడూ ఇలాంటి ఎలిమెంట్ ఏ డిటెక్టివ్ సినిమాలో లేదు. అది నాకు కొత్తగా ఆసక్తికరంగా అనిపించింది. దిష్టి బొమ్మ మనం చూస్తుంటాం. కానీ అసలు అది ఎందుకు వుందనేది పెద్దగా పట్టించుకోము. దాని గురించి చాలా మందికి తెలీదు. దిని గురించి పురాణాల్లో ఒక కథ వుంది. దానిని ఈ కథకు చాలా అద్భుతంగా జోడించాడు దర్శకుడు. దీంతో చాలా కొత్తదనం వుంటుందన్నారు.ఈ కథ కర్ణాటక, తెలంగాణ సరిహద్దుల మధ్య వుండే ఫారెస్ట్ టౌన్ నేపధ్యంలో జరుగుతుంది. దర్శకుడు పురుషోత్తం రాజ్ గారిది అనంతపురం దగ్గర ఓ విలేజ్. ఇందులో వున్న పాత్రలని ఆయన పల్లె జీవనంలో చూసిన పాత్రల్లా డిజైన్ చేశారన్నారు.


మేము మొదట ఎంచుకున్న వీఎఫ్ఎక్స్ టీం ఇచ్చిన అవుట్ పుట్ మాకు తృప్తిని ఇవ్వలేదు. దీంతో నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా మరో కంపెనీతో మొదటి నుంచి చేయించారు. ఈ విషయంలో నిర్మాతలకు ధన్యవాదాలు చెబుతున్నాను. సీజీ వర్క్ అద్భుతంగా వచ్చిందన్నారు శివకందుకూరి
ఇందులో కథానాయిక పాత్రకు తెలుగమ్మాయి అయితే బావుటుందని అనుకున్నాం. ఇలాంటి సమయంలో రాశి ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చారు. తనది తెలుగు కాకపోయినప్పటికీ తెలుగుని చాలా చక్కగా మాట్లాడగలరు. ప్రతి డైలాగ్ ని కష్టపడి నేర్చుకున్నారు. చాలా అంకితభావంతో పని చేశారన్నారు.


తన తండ్రి రాజ్‌ కందుకూరి గారికి ఈ సినిమా బాగా నచ్చిందన్నారు. తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి చెప్తూ.. ప్రమోద్ అనే కొత్త దర్శకుడితో ఓ సినిమా చేస్తున్నాను. ఓల్డ్ సిటీ నేపధ్యంలో జరిగే కథ అది. వినోదంతో పాటు మంచి భావోద్వేగాలు కూడా వుంటాయి. మార్చి 4 నుంచి షూట్ కి వెళ్తున్నాం. ఇది కాకుండా మరో రెండు సినిమాలు కూడా వున్నాయన్నారు.

Related Posts