సుమ, రాజీవ్ కనకాల తనయుడు రోషన్ కనకాల హీరోగా నటించిన చిత్రం ‘బబుల్ గమ్‘. ఈ సినిమాలో మానస చౌదరి కథానాయిక. ‘క్షణం, కృష్ణ అండ్ హిజ్ లీల’ మూవీస్ ఫేమ్ రవికాంత్ పేరెపు దర్శకత్వం వహించాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మిస్తోన్న ‘బబుల్ గమ్‘ డిసెంబర్ 29న విడుదలకు ముస్తాబవుతోంది. లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.
రిచ్ గాళ్ పూర్ గయ్ కాన్సెప్ట్ తో గతంలో చాలా సినిమాలొచ్చాయి. ఇప్పుడు అలాంటి కథాంశంతోనే రాబోతుంది ఈ చిత్రం. అయితే.. పక్కా యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాని
తీర్చిదిద్దాడు డైరెక్టర్ రవికాంత్ పేరెపు. నేటి యువతరానికి అద్దం పడుతూ ఈ సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ ఉంది. లిప్ లాక్ సీన్స్, బీప్ సౌండ్ వేసుకునే డైలాగ్స్ కూడా ట్రైలర్ లో ఉన్నాయి. మొత్తంమీద.. ట్రైలర్ తో మంచి ఇంప్రెస్ క్రియేట్ చేసిన ‘బబుల్ గమ్‘ విడుదల తర్వాత ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.
There are only four days left for the release of Bharatiyadu 2. Till now, the…
ఆగస్టులో ఆడియన్స్ ముందుకు వచ్చే చిత్రాల్లో నాని 'సరిపోదా శనివారం' ఒకటి. ఇప్పటికే నానితో 'అంటే.. సుందరానికి' వంటి సినిమా…
సోషల్ మీడియాలో విచ్చలవిడితనం పెరిగిపోయింది. సరదా పేరుతో కొంతమంది యూట్యూబర్లు పిల్లలపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. అలాంటి ఓ…
'కల్కి 2898 AD'లో బుజ్జి వెహికల్ కూడా ఒక పాత్రే. వెండితెరపై బుజ్జి కి తన వాయిస్ తో ప్రాణం…
జాతీయ ఉత్తమ నటుడు కమల్ హాసన్ కి తెలుగు చిత్ర పరిశ్రమతో ఎంతో అనుబంధం ఉంది. హీరో కాక ముందే…
విశ్వ నటుడు కమల్ హాసన్, గ్రేట్ డైరెక్టర్ శంకర్ కలయికలో వస్తోన్న చిత్రం 'భారతీయుడు 2'. 1996లో వచ్చిన 'భారతీయుడు'కి…