సుమ, రాజీవ్ కనకాల తనయుడు రోషన్ కనకాల హీరోగా నటించిన చిత్రం ‘బబుల్ గమ్‘. ఈ సినిమాలో మానస చౌదరి కథానాయిక. ‘క్షణం, కృష్ణ అండ్ హిజ్ లీల’ మూవీస్ ఫేమ్ రవికాంత్ పేరెపు దర్శకత్వం వహించాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మిస్తోన్న ‘బబుల్ గమ్‘ డిసెంబర్ 29న విడుదలకు ముస్తాబవుతోంది. లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.
రిచ్ గాళ్ పూర్ గయ్ కాన్సెప్ట్ తో గతంలో చాలా సినిమాలొచ్చాయి. ఇప్పుడు అలాంటి కథాంశంతోనే రాబోతుంది ఈ చిత్రం. అయితే.. పక్కా యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాని
తీర్చిదిద్దాడు డైరెక్టర్ రవికాంత్ పేరెపు. నేటి యువతరానికి అద్దం పడుతూ ఈ సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ ఉంది. లిప్ లాక్ సీన్స్, బీప్ సౌండ్ వేసుకునే డైలాగ్స్ కూడా ట్రైలర్ లో ఉన్నాయి. మొత్తంమీద.. ట్రైలర్ తో మంచి ఇంప్రెస్ క్రియేట్ చేసిన ‘బబుల్ గమ్‘ విడుదల తర్వాత ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.