నాగచైతన్యతో బొమ్మరిల్లు కట్టిస్తాడా..?

నాగచైతన్య లవ్ స్టోరీ, బంగార్రాజు చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ మంచి విజయాలను అందుకున్నాడు. తర్వాత విక్రమ్ కుమార్ డైరెక్షన్లో చేసిన థాంక్యూ చిత్రంతో రాబోతున్నాడు. మరోవైపు అమీర్ ఖాన్ తో కలసి చేసిన సినిమా కూడా రాబోతుంది. లేటెస్ట్ గా పరశురామ్ డైరెక్షన్లో సినిమాకి రెడీ అవుతున్న చైతూ… మరో టాలెంటెడ్ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే వార్తలు వస్తున్నాయి. నాగచైతన్య కంటిన్యూగా సినిమాలు చేస్తూ విజయాలు కూడా అందుకుంటున్నాడు. కొన్నాళ్ళుగా కథా బలం ఉన్న సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు చైతూ. అందులో భాగంగానే తన గత చిత్రాలు లవ్ స్టోరీ, బంగార్రాజు సక్సెస్ అయ్యాయి. అదే జోష్ లో ఉన్న చైతూ ఇప్పుడు మరింత స్పీడ్ పెంచుతున్నాడు. నాగచైతన్య ఇప్పుడు విక్రమ్ కుమార్ డైరెక్షన్లో చేసిన థాంక్యూ అనే మూవీతో రాబోతున్నాడు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాని జూలై 8న విడుదల చేయబోతున్నారు. విక్రమ్ కుమార్ డైరెక్టర్ కావడంతో మూవీపై బజ్ ఎక్కువగానే ఉంది. రాశీఖన్నా హీరోయిన్ గా నటించింది.

ఇక చైతూ త్వరలోనే సర్కారు వారి పాట దర్శకుడు పరశురామ్ తో సినిమాకి రెడీ అవుతున్నాడు. అలాగే తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో సినిమాని పట్టాలెక్కించాడు. ప్రస్తుతం తాను కమిట్ అయిన సినిమాలు కంప్లీట్ అయ్యాక… బొమ్మరిల్లు భాస్కర్ తో సినిమా చేస్తాడనే టాక్ వినిపిస్తోంది. చాలా గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో తాను హిట్ కొట్టడమే కాకుండా అఖిల్ కి కూడా హిట్ ఇచ్చాడు భాస్కర్. దీంతో నాగచైతన్య, బొమ్మరిల్లు భాస్కర్ తో సినిమాకి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట. ఎకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లోనే ఈ సినిమా కూడా రాబోతుందంటున్నారు. మొత్తానికి నాగచైతన్య జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నాడు.

Related Posts