ఆగస్ట్ 12.. మరో సినిమా వచ్చింది..

ఆగస్ట్ సెకండ్ వీక్ సినిమా రిలీజ్ లకు హాట్ డేట్ అయిపోయింది. వరుసగా చాలా సినిమాలు ఆ డేట్ టార్గెట్ గా రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేస్తున్నారు. అలాగని ఆ టైమ్ లో పెద్ద సినిమాలేం లేవు. ఉన్నవాటిలోనే పోటీ పెరుగుతోంది. ఇప్పటి వరకూ ఆ ఆగస్ట్ 12న సమంత నటించిన యశోద సినిమా విడుదల తేదీ ప్రకటించారు. అదే రోజు మాచర్ల నియోజకవర్గం, ఏజెంట్ చిత్రాలున్నాయి. వీటితో పాటు హిందీ సినిమా లాల్ సింగ్ చద్దా ఉంది. ఆమిర్ ఖాన్, నాగచైతన్య నటించిన సినిమా ఇది. ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.ఆమిర్ కు తెలుగులో మార్కెట్ లేకపోయినా చైతూ కోసం డబ్ చేస్తారు. అందువల్ల ఆ సినిమా కూడా పోటీలో ఉంటుంది. ఇవి చాలవన్నట్టుగా ఇప్పుడు మరో డబ్బింగ్ సినిమా ఆగస్ట్ 12 అంటోంది.

కొన్నాళ్లుగా ఒకే తరహా చిత్రాలు చేస్తూ ఒకే తరహా రిజల్ట్ చూస్తోన్న హీరో విశాల్. అంతకు ముందు డిఫరెంట్ జానర్స్ లో చేసిన సినిమాలు ఆకట్టుకున్నాయి. కానీ అభిమన్యుడు తర్వాత అన్నీ దాదాపు ఆ తరహా సినిమాలే వస్తున్నాయి. అయితే ఏజెంట్ లేదంటే ఆన్ లైన్ మోసాలు.. కుదిరితే కాస్త దేశభక్తి.. దాదాపు ఇదే తీరు అన్ని కథల్లో. అందుకే కొన్ని సినిమాల తర్వాత విజయం సంగతి అటుంచితే రివ్యూ చూడగానే మళ్లీ పాత సినిమాలకు వెళుతున్నారు జనం. అయినా వరుసగా సినిమాలు చేస్తూ వెళుతోన్న విశాల్ ఇప్పుడు లాఠీ అనే చిత్రంతో రాబోతున్నాడు. ఏ వినోద్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను ప్యాన్ ఇండియన్ రేంజ్ లో విడుదల చేస్తున్నారు. సౌత్ తో పాటు హిందీలోనూ వదులుతున్నామని ప్రకటించారు.

విశాల్ సినిమాలు వాస్తవానికి విశాల్ తెలుగు మార్కెట్ ఎప్పుడో పడిపోయింది. ఒకప్పుడు ఫర్వాలేదనిపించుకున్నా.. ఇంతకు ముందు చెప్పినట్టు రొటీన్ సినిమాలతో ఉన్న మార్కెట్ ను పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ప్యాన్ ఇండియన్ పోటీ ప్రపంచంలో మళ్లీ దాన్ని సంపాదించుకోవడం అంత సులువైతే కాదు. పైగా విశాల్ వన్నీ ఊరమాస్ యాక్షన్ సినిమాలే కావడంతో కేవలం ఒక వర్గం ప్రేక్షకుల వద్దే ఆగిపోయాడు. దాన్ని బ్రేక్ చేయాలంటే కొత్త కథలు ప్రయత్నిస్తే తప్ప సాధ్యం కాదు. ఏదేమైనా ఆగస్ట్ 12కు మాత్రం రోజు రోజుకూ పోటీ పెరుగుతోంది. మరి ఫైట్ లో విన్నర్ ఎవరో..?

Related Posts