కలెక్షన్స్ లో ఎఫ్ 3 సత్తా చూపిస్తుందా ?

ఎఫ్3 సినిమా సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్ వస్తుందంటే ఆడియన్స్ లో ఆ మూవీ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ ఏర్పడుతుంది. అలాంటి సినిమానే ఎఫ్3. అనిల్ రావిపూడి డైరెక్షన్లో వచ్చిన ఎఫ్2కి సీక్వెల్ గా తెరకెక్కిన ఎఫ్3 ఈ నెల 27న విడుదలకు సిద్దమైంది. సాంగ్స్, ట్రైలర్ తో మూవీపై ఆల్ రెడీ బజ్ పెరిగింది. మరోవైపు మేకర్స్ కూడా ఫుల్ గా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఎఫ్3 మూవీ ఎలా ఉండబోతుంది. బిజినెస్ ఎంత చేసింది. తెలుగు ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్న మూవీ ఎఫ్3.

అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కిన ఎఫ్2కి ఈ సినిమా సీక్వెల్. దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న ఎఫ్3లో వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ నటించారు. అయితే సునీల్, సోనాల్ చౌహాన్ కొత్తగా యాడ్ అయ్యారు. ఫుల్ లెంగ్త్ ఫన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఎఫ్3 భారీ అంచనాలతో ఈ నెల 27న విడుదలవుతోంది. ఎఫ్3కి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇచ్చాడు. ఇప్పటికే కొన్ని సాంగ్స్ రిలీజై సూపర్ సక్సెస్ అయ్యాయి. అలాగే రీసెంట్ గా వచ్చిన ధియేట్రికల్ ట్రైలర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు మేకర్స్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. రీసెంట్ గానే గ్రాండ్ గా ఈ సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. మరో వైపు అనిల్ రావిపూడి ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ లోని టాప్ ప్రోగ్రామ్స్ లో ఫుల్ గా ప్రమోషన్స్ చేస్తున్నాడు. అలాగే టీమ్ ఇంటర్వ్యూలు కూడా హల్ చల్ చేస్తున్నాయి. దీంతో ఎఫ్3పై ఆడియన్స్ లో మంచి బజ్ కనిపిస్తోంది.

ఎఫ్2లో భార్య భర్తల రిలేషన్స్ ని ఫన్నీగా చూపించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఇప్పుడు ఎఫ్3లో డబ్బు అనే కాన్సెప్ట్ ని తీసుకుని ఫన్ జనరేట్ చేశామని చెప్తున్నారు. ఎంటర్టైన్మెంటే హైలైట్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో మళ్ళీ వెంకటేషే అందరికంటే ఎక్కువగా అలరించబోతున్నాడని ట్రైలర్ చూస్తే అర్ధమవుతోంది. ఇక టాప్ హీరోయిన్ పూజా హెగ్డేతో ఓ స్పెషల్ సాంగ్ చేయించారు. ఈ సాంగ్ ఖచ్చితంగా స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉండబోతుంది. ఈ సినిమాకి 80 కోట్ల బిజినెస్ జరిగిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఎఫ్2 దాదాపు 150 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించనట్లు అప్పట్లో ట్రేడ్ వర్గాల రిపోర్ట్ ఉంది. మరి ఎఫ్3 అంతకుమించి వసూళ్ళు సాధిస్తుందా లేదా అనేది చూడాలి.

Related Posts