ఆలోచ‌న‌లో ప‌డిన “అల‌.. వైకుంఠ‌పుర‌ములో” బాలీవుడ్ మేక‌ర్స్

పుష్ప సినిమా బాలీవుడ్ లో ఎంత‌టి సెన్సేష‌న్ క్రియేట్ చేసిందో అంద‌రికీ తెలిసిందే. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర రికార్డు క‌లెక్ష‌న్స్ వ‌సూలు కావ‌డంతో.. బాలీవుడ్ పండితులు సైతం షాక్ అవ్వ‌డం జ‌రిగింది. దీంతో నార్త్ లో అల్లు అర్జున్ రేంజ్ ఎక్క‌డికో వెళ్లిపోయింది. బీహార్ లో అల్లు అర్జున్ న‌టించిన దేశ‌ముదురు మూవీని డ‌బ్బింగ్ చేసి థియేట‌ర్లో రిలీజ్ చేస్తున్నారంటే.. ఏ రేంజ్ క్రేజ్ ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.

టాలీవుడ్ లో 2020 సంక్రాంతికి విడుద‌లైన అల‌.. వైకుంఠ‌పుర‌ములో చిత్రం నాన్ బాహుబ‌లి రికార్డుల‌ను సొంతం చేసుకుంది. తాజాగా అల‌.. వైకుంఠ‌పుర‌ములో హిందీ డ‌బ్బింగ్ మూవీని జ‌న‌వ‌రి 26న దేశ వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు. దీనిని అఫిషియ‌ల్ గా అనౌన్స్ చేయ‌డం కూడా జ‌రిగింది. ఇందులో పూజా హేగ్డే, ట‌బు, స‌చిన్ కెడ్క‌ర్, స‌ముద్ర‌ఖ‌ని త‌దిత‌ర నోటెడ్ ఆర్టిస్టులు ఉండ‌డంతో అక్క‌డ ఆడియ‌న్స్ కు బాగా రీజ్ అవ్వ‌డం ఖాయం అంటున్నారు.

బాలీవుడ్ లో భారీ చిత్రాల రిలీజ్ లు లేక‌పోవ‌డంతో దీనిని క్యాష్ చేసుకోవాల‌నే ఉద్దేశ్యంతో గోల్డ్ మైన్ సంస్థ ఈ చిత్రాన్ని డ‌బ్ చేసి రిలీజ్ చేస్తుంది. అయితే.. అల‌.. వైకుంఠ‌పుర‌ములో రీమేక్ వెర్సెన్ కొన్ని రోజుల క్రితం స్టార్ట్ చేశారు. కార్తీక్ ఆర్య‌న్, కృతి స‌న‌న్ జంట‌గా షూటింగ్ స్టార్ట్ చేశారు. షెహ‌జాదా టైటిల్ ఫిక్స్ చేశారు. అయితే.. ఇప్పుడు డ‌బ్బింగ్ వెర్ష‌న్ రిలీజ్ చేస్తే.. అంద‌రూ చూసేస్తారు. అందుచేత ఈ రీమేక్ ఇర‌కాటంలో ప‌డింది. దీంతో ఈ రీమేక్ ని క్యాన్సిల్ చేస్తారేమో అనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి సౌత్ సినిమా స‌త్తా బాలీవుడ్ కి ఇప్పుడు బాగా తెలిసి వ‌చ్చుంటుంది.

Related Posts