అటు చెన్నైలో ర‌జ‌నీ కూతురు.. ఇటు హైద‌రాబాద్ లో చిరు కూతురు..?

సూప‌ర్ స్టార్ రజ‌నీకాంత్ కూతురు ఐశ్వ‌ర్య‌, హీరో ధ‌నుష్ విడాకులు తీసుకుంటున్న‌ట్టుగా ప్ర‌క‌టించారు.
కోలీవుడ్, టాలీవుడ్ లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ఇదేదో గాసిప్పో.. రూమ‌రో కాదు. నిజంగా నిజం.
ధ‌నుషే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. ఇదే షాకింగ్ అనుకుంటే.. మ‌రో షాకింగ్ చిరంజీవి కూతురు శ్రీజ, క‌ళ్యాణ్ దేవ్ విడాకులు తీసుకుంటున్నార‌ని వార్త‌లు రావ‌డం.

ఒకవైపు కోలీవుడ్ మెగాస్టార్ రజినీకాంత్ బిడ్డ విడాకుల వార్త బ‌య‌ట‌కు వ‌చ్చిన రోజే… టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూతురు విడాకుల వార్త కూడా ఒక్కసారిగా బ‌య‌ట‌కు రావ‌డం జ‌రిగింది. అయితే… ధనుష్ విడాకుల వార్త అధికారికం… మరి చిరంజీవి కూతురు విడాకులు సంగ‌తి..?

ఇంత‌కీ విష‌యం ఏంటంటే… హఠాత్తుగా శ్రీజ ట్విట్టర్, ఇన్‌స్టాగ్రాం ఖాతాల్లో తన పేరు పక్కన భర్త కల్యాణ్ దేవ్ పేరుకు బదులు తమ పుట్టింటి ఇంటిపేరు వచ్చేసింది మళ్లీ… శ్రీజ కొణిదెల అని కనిపిస్తోంది… నిజమే, ఆమె రెండు అఫిషియల్ ఖాతాల్లోనూ ఈ మార్పు కనిపిస్తోంది… సాధారణంగా విడాకుల వంటి వ్యవహారాల్లో ఫస్ట్ సందేహాలు తలెత్తేది సోషల్ ఖాతాల్లో పేర్ల మార్పిడితోనే. సమంత కూడా అక్కినేని అనే ఇంటిపేరు తొలగించాక దాదాపు అందరికీ కన్‌ఫమ్ అయిపోయింది. చివరకు విడిపోయారు… వాళ్లే కాదు, సెలబ్రిటీలు తమ పేర్లలో ఏదో మార్పు చేశారు అంటే, ఏదో జరుగుతోంది అనే అర్థం… షణ్ముఖ పేరును దీప్తి కొట్టేసుకున్నా అంతే… సిరి హన్మంతు పేరును శ్రీహాన్ కొట్టేసుకున్నా అంతే…

శ్రీజ మొదటి భర్త పేరు శిరీష్ భరధ్వాజ్… 2007లోనే పెళ్లయింది… నాలుగేళ్లకు అది పెటాకులు… అందరికీ తెలిసిందే. తరువాత కల్యాణ్‌దేవ్‌తో పెళ్లయింది… 2016లో… తను కూడా హీరో అయ్యాడు… మొన్నమొన్ననే ఓ సినిమా కూడా రిలీజైంది. ఆ కొత్త సినిమాను మెగాక్యాంప్ పెద్దగా పట్టించుకున్నట్టు అనిపించలేదు. వాళ్లకు ఇద్దరు పిల్లలు కూడా… నివృత్తి, నవిష్క. అఫిషియ‌ల్ గా అనౌన్స్ చేయ‌క‌పోయినా.. శ్రీజ విడాకులు క‌న్ ఫ‌ర్మ్ అని గ‌ట్టిగా వినిపిస్తోంది. మ‌రి.. త్వ‌ర‌లోనే అఫిషియ‌ల్ గా అనౌన్స్ చేస్తారేమో. ఏది ఏమైనా… ఈ విడాకులు అటు ర‌జ‌నీకాంత్, ఇటు చిరంజీవి ఇద్ద‌రికీ బాగా బాధ‌క‌లిగించేవే.

Related Posts