ఖైదీ టైటిల్ ను భోళా మార్చారు..

ఖైదీ.. ఒకప్పుడు చిరంజీవి అనే అప్ కమింగ్ హీరోను టాప్ స్టార్ గా మార్చిన సినిమా. అదే టైటిల్ తో తర్వాత చాలా సినిమాలు వచ్చాయి. కానీ ఆ తర్వాత ఆ స్థాయిలో ముద్ర వేసింది తెలుగులో ఓ డబ్బింగ్ సినిమా కావడం విశేషం. యస్.. కార్తీ హీరోగా నటించిన ఖైదీ సినిమా తెలుగులోనూ సూపర్ హిట్ అనిపించుకుంది. ఈ చిత్రానికి లోకేష్ కనకరాజ్ దర్శకుడు. ఖైదీతో ఓవర్ నైట్ టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లోకి వెళ్లిపోయాడు లోకేష్. ఆ వెంటనే విజయ్ తో మాస్టర్ చేసి మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ప్రస్తుతం కమల్ హాసన్ తో విక్రమ్ సినిమా చేస్తున్నాడు. ఇక కార్తీ మాత్రం ఖైదీ సెంటిమెంట్ ను కంటిన్యూ చేస్తూ కార్తీ మరోసారి చిరంజీవి టైటిల్ ను దొంగను వాడుకున్నాడు. కానీ అది ఖైదీలా ఏ మ్యాజిక్ చేయలేదు. అలాంటి సినిమా టైటిల్ ను మార్చారిప్పుడు. అంటే తెలుగులోనో తమిళ్ లోనో కాదు. హిందీలో. యస్ ఈ మూవీ హిందీలో రీమేక్ అవుతోంది కదా… అక్కడ టైటిల్ ను మార్చారు.
ఖైదీ హిందీ రీమేక్ లో అజయ్ దేవ్ గణ్ నటిస్తున్నాడు. అయితే అక్కడ కూడా ఇదే టైటిల్ ను రిపీట్ చేస్తారు అనుకున్నారు. ఎందుకంటే ఆ కథకు ఈ టైటిలే హండ్రెడ్ పర్సెంట్ సెట్ అవుతుంది. అయినా హిందీలో ‘భోళా’అని మార్చారు. ఇందుకు మరో కారణం కూడా అనుకోవచ్చు. ఇదే టైటిల్ తో సినిమా ఆల్రెడీ ఓటిటిల్లో సందడి చేస్తోంది. మళ్లీ అదే పేరుతో హిందీలో చేస్తే పాతదే కదా అని పక్కన బెడతారు. ఆ కారణంగానే వాళ్లు టైటిల్ మార్చారనుకోవచ్చు. ఇక ఈ చిత్రాన్ని ఇంతకు ముందు హిందీలో తానాజీ చిత్రానికి ఎడిటర్ గా పనిచేసిన ధర్మేంద్ర శర్మ డైరెక్ట్ చేస్తుండటం విశేషం. తానాజీలోనూ అజయ్ దేవ్ గణ్ హీరోగా నటించాడు. ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన ఓమ్ రౌత్ ఇప్పుడు ప్రభాస్ ను డైరెక్ట్ చేశాడు.
మొత్తంగా తమిళ్, తెలుగులో సూపర్ హిట్ గా నిలిచిన ఈ మూవీ హిందీ రీమేక్ ‘భోళా’ కూడా అదే మ్యాజిక్ ను రిపీట్ చేస్తుందా లేదా అనేది చూడాలి.

Related Posts