భీమ్లా నాయక్ ప్రి రివ్యూ – బొమ్మ బ్లాక్ బస్టర్ అంతే..

భీమ్లా నాయక్.. ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమ ఈగర్ గా ఎదురుచూస్తోన్న సినిమా. మరికొన్ని గంటల్లోనే సినిమా రేంజ్ ఏంటనేది కామన్ ఆడియన్సెస్ కు తెలియబోతోంది. అయితే ఇప్పటికే కొన్ని దేశాల్లో సినిమా ప్రదర్శన అయిపోయింది. అక్కడి నుంచి వస్తోన్న ప్రీ రివ్యూనే ఇది. రివ్యూలోకి వెళ్లే ముందు ఓ విషయం స్పష్టంగా చెప్పొచ్చు. ఇది కేవలం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం కాదు. ఎంటైర్ ఆడియన్సెస్ కు ఎంటర్టైన్ చేసే బిగ్గెస్ట్ హిట్ గా నిలవబోతోన్న సినిమా. ఆ మేరకు సింపుల్ గా సినిమాను బ్లాక్ బస్టర్ గా డిక్లేర్ చేయొచ్చు.

కథగా చూస్తే.. ఫారెస్ట్ ఏరియాలోని ఓ స్టేషన్ లో ఎస్ఐగా పనిచేస్తుంటాడు భీమ్లా నాయక్. ఆ స్టేషన్ పరిధిలోనే చట్ట వ్యతిరేక కార్యకలాపాలతో పోలీస్ లక పట్టు బడతాడు డేనియల్ అనే వ్యక్తి. బాగా తాగేసి ఉన్న అతను పోలీస్ లతో దురుసుగా ప్రవర్తిస్తాడు. ఈ క్రమంలో ఓ పోలీస్ పై చేయి చేసుకుంటే.. భీమ్లా నాయక్ వెళ్లి అతన్ని కొట్టి అరెస్ట్ చేస్తాడు. స్టేషన్ కు వెళ్లిన తర్వాత తనో కాబోయే పొలిటీషియన్ ను అని, ఆల్రెడీ ఓ పొలిటీషియన్ కొడుకునే అనే అహంకారంతో భీమ్లా నాయక్ ఇబ్బంది పెడతాడు. పెట్టడమే కాదు.. అతన్ని సస్పెండ్ కూడా చేయిస్తాడు. అక్కడి నుంచి ఈ ఇద్దరి మధ్య అహంకారం, ఆత్మాభిమానం అనే పాయింట్స్ తో కథ నడుస్తుంది. అది వెండితెరపై చూస్తేనే మీకూ ఈ పవర్ స్ట్రోమ్ ఎలా ఉంటుందో అర్థమౌతుంది.

విశ్లేషణ
సినిమా ఆరంభం నుంచి ఆఖరు వరకూ ఎక్కడా టెంపో తగ్గదు. సరికదా.. ప్రతి సీన్ కూ ఆ టెంపో పెరుగుతూ చూస్తోన్న వారి టెంపరేచర్ కూడా పెంచుతుంది. ఫస్ట్ హాఫ్ లో కాస్త రానా డామినేషన్ కనిపిస్తుంది. ఖచ్చితంగా చెబితే కొన్నిసార్లు పవన్ పాత్ర అతని డామినేషన్ కు డౌన్ అవుతుంది కూడా. హార్డ్ కోర్ ఫ్యాన్స్ ను ఇది ఇబ్బంది పెట్టొచ్చేమో కానీ.. సెకండ్ హాఫ్ కు ఇదే అద్భుతమైన లీడ్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం చూస్తూ వెళితే.. సెకండ్ హాఫ్ లో యూనిఫామ్ పోయిన తర్వాత పవన్ కళ్యాణ్ దండయాత్ర మొదలవుతుంది. ముఖ్యంగా లాడ్జ్ లో ఫైట్ మళయాలంలో కంటే చాలా బెటర్ గా ఉంటుందని చెప్పొచ్చు. అలాగే ఇంటర్వెల్ బ్యాంగ్ ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ సినిమాల్లో లేనంత హైప్ తో ఉంటుంది. అక్కడి నుంచి మొదలైన పవన్ సునామీ.. క్లైమాక్స్ వరకూ కంటిన్యూ అవుతుంది.
సెకండ్ హాఫ్ లో నిత్య మీనన్ నటన మెస్మరైజ్ చేస్తుంది. తన పాత్ర కూడా రెబల్ గా ఉంటుంది. తనూ గొప్పగా నటించింది. భీమ్లా నాయక్, నిత్య మీనన్ మధ్య కనిపించే కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. అయితే చిత్ర పాడిన ‘అంత ఇష్టమే ఏందయ్యా’ అనే పాట సినిమాలో లేకపోవడం కొంత డిజప్పాయింట్ చేస్తుంది. డ్యూరేషన్ ఎక్కువ కావడం వల్ల తీసేశారని చెబుతున్నారు. కానీ ఆల్రెడీ ఆడియో విని ఫ్యాన్ అయిన వాళ్లు సినిమాలో లేకపోతే డిజప్పాయింట్ అవుతారు కదా..
ఫస్ట్ ట్రైలర్ లో తమన్ నేపథ్య సంగీతం విని అస్సలు బాలేదనే కమెంట్స్ వచ్చాయి. కానీ అతను కావాలనే అలా చేశాడని సినిమా చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే ఈ ఆర్ఆర్ కూడా అఖండ రేంజ్ లో థియేటర్స్ ను ఊపేస్తుందని చెప్పొచ్చు. సినిమాటోగ్రఫీ సూపర్బ్. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ ఉన్నాయి. కానీ ఇంతకు ముందులా పంచ్ లు, నీతి వాక్యాలు కాకుండా కథకు తగ్గట్టుగా సింపుల్గానే ఉంటాయి. ప్రొడక్షన్ వాల్యూస్ గురించి చెప్పేదేముందీ. సితార సినిమా అంటే నెక్ట్స్ లెవెల్లో ఉంటుంది కదా..? దర్శకుడుగానే కాదు.. ఈ కథను పూర్తిస్థాయిలో తెలుగు ప్రేక్షకులతో పాటు పవన్ అభిమానుల టేస్ట్ కు అనుగుణంగా డెవలప్ చేసింది దర్శకుడు సాగర్ కె చంద్ర. అసలు అతను చేసిన మార్పులు చూసే ఈ ప్రాజెక్ట్ లో పవన్ ఎంటర్ అయ్యాడు. అతని డైరెక్షన్ కూడా అద్భుతంగానే ఉంది.
మొత్తంగా పవన్ ఫ్యాన్స్ కే కాదు.. ప్రతి సినిమా లవర్ నూ మెస్మరైజ్ చేసే సినిమా. సమ్మర్ సీజన్ ముందు వస్తోన్న ఈ మూవీ టాలీవుడ్ కే ఓ క్రేజీ బూస్టప్ ఇస్తుందని ఖచ్చితంగా చెప్పొచ్చు.

Related Posts