ఆర్ఆర్ఆర్ కు షాక్ ఇస్తోన్న భీమ్లా నాయక్ ..?

ఆర్ఆర్ఆర్ .. దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సినిమా. తెలుగులో చాలా యేళ్ల తర్వాత ఇద్దరు మాస్ హీరోలు కలిసి నటించిన మల్టీస్టారర్ కావడంతో పాటు ఇండియాస్ టాప్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన సినిమా కాబట్టి.. ఇంకాస్త ఎక్కువ అటెన్షన్ ఉందీ చిత్రంపై. ఇప్పటికే వచ్చిన ట్రైలర్ తో పాటు పాటలు ఆకట్టుకున్నాయి. ఎలా చూసినా ప్రస్తుతం మోస్ట్ అవెయిటెడ్ సినిమాగా ఆర్ఆర్ఆర్ ను చెప్పొచ్చు. మరి ఇలాంటి సినిమాకు షాక్ ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు కదా.. ఆ పని చేస్తున్నాడు భీమ్లా నాయక్.

దాదాపు నాలుగుసార్లు రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అయింది ఆర్ఆర్ఆర్ సినిమా. నిజానికి ఈ జనవరి 7న ఖచ్చితంగా వస్తారని చాలామంది భావించారు. అందుకు కారణం దేశవ్యాప్తంగా వీళ్లు చేసిన ప్రమోషన్స్. దీంతో చాలామంది ప్రేక్షకులు ఈ చిత్రం కోసం ఎదురుచూశారు. కానీ ఒమిక్రాన్ కు భయపడి మళ్లీ పోస్ట్ పోన్ కావడంతో అభిమాలను కూడా నిరాశచెందారు. వారి నిరాశను పోగొట్టేలా మళ్లీ ఆ స్థాయిలో ఇప్పుడు ప్రమోషన్స్ కనిపించడం లేదు. ఇంకా చెబితే జనవరిలో ఉన్న ఆసక్తి ఆడియన్సెస్ లో ఇప్పుడు లేదు. ఇదే పెద్ద మైనస్ అనుకుంటే వీరికి మరింత షాక్ ఇస్తూ పవర్ స్టార్ పవర్ ప్యాక్డ్ మూవీ భీమ్లా నాయక్ మరో షాక్ ఇవ్వబోతోందీ ఆర్ఆర్ఆర్ కి.
ఆర్ఆర్ఆర్ ఈ నెల 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. అదే రోజు పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ కూడా ఓటిటిలో విడుదలవుతోంది. అది కూడా రెండు ఓటిటి ప్లాట్ ఫామ్స్ లో కావడం విశేషం. నార్త్ ఆడియన్స్ ఎక్కువగా ఉండే హాట్ స్టార్ తో పాటు తెలుగు ప్రేక్షకులకు ఎక్కువ సొంతమైన ఆహాలో భీమ్లా నాయక్ 25నుంచి స్ట్రీమ్ కాబోతోంది. భీమ్లా నాయక్ ఎవరికీ భయపడకుండా టికెట్ రేట్లు తగ్గించినా తల వంచకుండా వచ్చి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అందువల్ల మరోసారి ఫ్యామిలీ ఆడియన్స్ ఈ చిత్రాన్ని ఓటిటి ప్లాట్ ఫామ్ లో చూసేందుకు ఇంట్రెస్టింగ్ గా ఉన్నారనేది నిజ. ఆ ప్రేక్షకులు ఖచ్చితంగా మొదటి రోజు ఆర్ఆర్ఆర్ ను లైట్ తీసుకుంటారని చెప్పొచ్చు. మరి ఇది కావాలని చేశారా.. లేక ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ పై నమ్మకం లేకపోవడం వల్ల జరిగిందా అనేది చెప్పలేం కానీ.. ప్లాట్ ఫామ్స్ వేరైనా.. రెండు పెద్ద సినిమాలు ఒకే రోజు విడుదలవుతుండటం.. ఈ రెంటి బడ్జెట్ పరంగా పెద్ద సినిమాకే సమస్య అని ఎవరికైనా అర్థం అవుతుంది.

Related Posts