సంక్రాంతి అంటే మనవారికి అందమైన రంగవల్లులు, హరిదాసుల కీర్తనలు, ఆడపడుచుల సందళ్లు.. మరదల్ల ఆటలు బావల సయ్యాటలే కాదు కొత్త సినిమా పోస్టర్లు కూడా. యస్.. పండగపూట సినిమా కూడా చూడటం తెలుగువారి సంక్రాంతిలో భాగం. అందుకే ఈ సీజన్ లో స్టార్ హీరోలే ముందుకు వస్తుంటారు. ఇప్పటికే 2023 సంక్రాంతి రేస్ లో చాలా సినిమాలు ఉన్నాయి. అయితే ఎప్పటి నుంచో సంక్రాంతి అంటే తనదే అని నిరూపించుకున్న రోరింగ్ స్టార్ బాలయ్య కూడా పండగ రేస్ లోకి ఎంటర్ అయ్యాడు..
స్టార్ హీరోల సినిమాలంటే ఎంత క్రేజ్ ఉంటుందో అందరికీ తెలుసు. ఇక పండగల టైమ్ లో వస్తే ఫ్యామిలీ అంతా కలిసి థియేటర్స్ కు క్యూ కడుతుంటారు. ఈ క్యూ స్ ను పెంచడంలో బాద్ షా అనిపించుకున్న స్టార్ బాలయ్య. బాలయ్య సినిమా అంటే సంక్రాంతి సందడి డబుల్ అవుతుంది. కొంత గ్యాప్ తర్వాత బాలయ్య సంక్రాంతి బరిలోకి దిగుతున్నాడు. ఆ టైమ్ కు ఎవరు వస్తున్నా.. మన నటసింహం ఎంటర్ అయితే ఎంటర్టైన్మెంట్ రేంజ్ మారుతుంది. పైగా అఖండ వంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత చేస్తోన్న సినిమా ఇది. అటు దర్శకుడు కూడా క్రాక్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత డైరెక్ట్ చేస్తోన్న మూవీ. సో.. వీరి క్రేజ్ ఈ మూవీకి పెద్ద ఎసెట్ అవుతుందని వేరే చెప్పాలా..?
నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో వస్తోన్న సినిమాను సంక్రాంతి బరిలో విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది. నిజానికి ఈ మూవీని ఈ దీపావళి లేదా అఖండ వచ్చిన డిసెంబర్ లో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు షూటింగ్స్ బంద్ చేశారు కదా.. ? ఆ కారణంగానే లేట్ అవుతోంది. పైగా టర్కీలో అనుకున్న షెడ్యూల్ కూడా ఆలస్యం అవుతోందట. అందుకే సంక్రాంతి సీజన్ లో రిలీజ్ చేయబోతున్నారు. బాలయ్య 107వ సినిమాగా వస్తోన్న ఈ మూవీలో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడ హీరో దునియా విజయ్ విలన్ గా యాక్ట్ చేస్తున్నాడు. మళయాల నటుడు లాల్ తో పాటు వరలక్ష్మి శరత్ కుమార్, హనీరోజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నాడు. మరి బాలయ్య ఎంట్రీతో ఈ సారి సంక్రాంతి పోటీ మరింత క్రేజీగా ఉంటుందని చెప్పొచ్చు.
సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…
రాబోయే మూడు నెలల్లో 'కల్కి' తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో అలరించడానికి రాబోతున్న మరో తెలుగు చిత్రం 'పుష్ప…
'హనుమాన్' మూవీతో నయా స్టార్ గా అవతరించిన తేజ సజ్జ హీరోగా నటిస్తున్న చిత్రం 'మిరాయ్'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ…
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బర్త్ డే.. మరో రెండు రోజులు మాత్రమే ఉంది. యంగ్ టైగర్ బర్త్ డే…
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ 'విశ్వంభర'. 'బింబిసార' ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.…
Any update regarding Tamil Dalapathy Vijay goes viral on social media within moments of its…