‘హనుమాన్‘ చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించిన బాలకృష్ణ

కంటెంట్ ఉంటే చాలు అది చిన్నదా, పెద్దదా అని తేడా లేకుండా.. ఆ చిత్రానికి అదిరిపోయే విజయాన్నందిస్తారు ఆడియన్స్. ఇప్పుడు ‘హనుమాన్‘ విషయంలో అదే జరుగుతోంది. సంక్రాంతి బరిలో చిన్న సినిమాగా విడుదలై.. అఖండ విజయం సాధించే దిశగా ‘హనుమాన్‘ దూసుకెళ్తుంది. ఈ సినిమాకి సాధారణ ప్రేక్షకుల నుంచే కాదు.. సెలబ్రిటీల నుంచి కూడా ఫుల్ సపోర్ట్ లభిస్తోంది. లేటెస్ట్ గా నటసింహం నందమూరి బాలకృష్ణ ‘హనుమాన్‘ చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించారు.

‘హనుమాన్‘ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. బాలయ్య హోస్ట్ చేస్తోన్న ‘అన్ స్టాపబుల్‘ కోసం పనిచేశారు. ఈ షో కి సంబంధించి బాలకృష్ణ ప్రోమోని అద్భుతంగా డిజైన్ చేసింది ప్రశాంత్ వర్మే. అలా.. ప్రశాంత్ వర్మ తో మంచి అనుబంధం కారణంగా ‘హనుమాన్‘ సినిమాని అప్రిసియేట్ చేయడానికి ముందుకొచ్చారు నటసింహం. ఈ సినిమా చూసిన తర్వాత బాలకృష్ణ చిత్రబృందాన్ని అభినందించినట్టు తెలుస్తోంది.

టాలీవుడ్ నుంచి బాలకృష్ణ, చిరంజీవి వంటి లెజెండ్స్ తో పాటు.. ఎనర్జటిక్ స్టార్ రామ్ వంటి నేటితరం హీరోలు కూడా ‘హనుమాన్‘కి సామాజిక మాధ్యమాల తర్వాత మంచి సపోర్ట్ అందిస్తున్నారు. పాన్ ఇండియా మూవీ కావడంతో.. ఈ సినిమాకి పరభాషా కథానాయకుల నుంచి మంచి సపోర్ట్ లభిస్తోంది.

ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించిన కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ ‘హనుమాన్‘ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇంకా.. మలయళం నుంచి కూడా ఉన్ని ముకుందన్ వంటి స్టార్స్ ‘హనుమాన్‘ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. విడుదలైన నాలుగు రోజులకే వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లు కొల్లగొట్టిన ‘హనుమాన్‘.. లాంగ్ రన్ లో భారీ వసూళ్లు సాధించే దిశగా దూసుకెళ్తుంది.

Related Posts