మెగా సెలబ్రేషన్స్ లో అదరగొట్టిన అకిరా నందన్

మెగా సంక్రాంతి సెలబ్రేషన్స్ లో సెంట్రాఫ్ ఎట్రాక్షన్ గా నిలిచారు పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్, కూతురు ఆద్య. పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ మెగా ఈవెంట్స్ కి దూరంగా ఉన్నా.. అకిరా, ఆద్య మాత్రం మెగా సెలబ్రేషన్స్ లో సందడి చేస్తుంటారు. ఇటీవల బెంగళూరులో మెగా ఫ్యామిలీ అంతా సంక్రాంతి పండగను అంగరంగ వైభవంగా జరుపుకుంది. ఈ వేడుకలో పవన్ కళ్యాణ్ తప్ప మెగా ఫ్యామిలీకి సంబంధించిన హీరోలంతా కనువిందు చేశారు. అయితే.. పవన్ రాని లోటును.. ఆయన తనయుడు అకిరా, తనయ ఆద్య తీర్చారు.

మెగా సంక్రాంతి వేడుకలో అకిరా నందన్ పాల్గొనడమే కాదు.. తన మ్యూజికల్ పెర్ఫామెన్స్ తో కుటుంబ సభ్యులందరినీ స్టన్ అయ్యేలా చేశాడట. ‘యానిమల్‘ సినిమాలోని ‘నాన్నా నువ్వు నా ప్రాణం అనినా..‘ అంటూ సాగే గీతాన్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ పై వాయించి.. తన తండ్రిపై తనకున్నా ప్రేమను చాటుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అకీరా ని సినిమాల్లోకి రావాలని ఫ్యాన్స్ ఎప్పట్నుంచో కోరుతున్నారు. ఈ విషయంపై ఆమధ్య రేణు దేశాయ్ కూడా పాజిటివ్ గానే స్పందించింది. ప్రస్తుతం 19 ఏళ్ల అకీరా నందన్.. పియానో, యోగా, మార్షల్ ఆర్ట్స్, రైటింగ్, ఫిలిం ప్రొడక్షన్ అంటూ వివిధ విభాగాలపై శిక్షణ తీసుకుంటున్నాడట. మొత్తంమీద.. అకీరా నందన్ డెబ్యూకి సంబంధించి త్వరలోనే మెగా ఫ్యాన్స్‌కి తీపికబురు అందుతుందేమో చూడాలి.

Related Posts