మెగా మల్టీస్టారర్ ‘కన్నప్ప’లో బాలకృష్ణ

కథ నచ్చితే చాలు కాంబినేషన్స్ గురించి అస్సలు పట్టించుకోడు నటసింహం బాలకృష్ణ. తాను కమిట్ అయిన పాత్రకు న్యాయం చేయడమే తన పరమావధిగా భావిస్తుంటాడు. ఈకోవలో కొన్నిసార్లు అతిథి పాత్రల్లోనూ అలరిస్తుంటాడు. గతంలో మంచు మనోజ్ హీరోగా నటించిన ‘ఊ కొడతారా ఉలిక్కి పడతారా‘ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించాడు బాలకృష్ణ. ఆ చిత్రానికి బాలయ్య రోల్ ఎంతో హైలైట్ అయ్యింది. ఇప్పుడు మంచు మెగా ప్రాజెక్ట్ ‘కన్నప్ప’లోనూ నటించడానికి బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఫిల్మ్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతుంది.

విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రాబోతోన్న ‘కన్నప్ప’ సినిమా మీదున్న అంచనాల గురించి అందరికీ తెలిసిందే. న్యూజిలాండ్‌ ‌లోని అందమైన లొకేషన్స్ లో ఈ చిత్రం మేజర్ పార్ట్ చిత్రీకరణను పూర్తిచేస్తున్నారు. ఈ చిత్రంలో విష్ణు టైటిల్ రోల్ లో కన్నప్ప గా కనిపించబోతుండగా.. ఇతర కీలక పాత్రల్లో మోహన్ బాబు, మోహన్ లాల్, ప్రభాస్ వంటి స్టార్స్ నటిస్తున్నారు. ఈ సినిమాలో మంచు విష్ణు తనయుడు అవ్రామ్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.

ఇప్పటికే మల్టీస్టారర్ గా మంచి క్రేజ్ సంపాదించుకున్న ‘కన్నప్ప’లో నటసింహం బాలకృష్ణ చేయబోయే రోల్ గురించి ఎలాంటి క్లారిటీ లేదు. త్వరలోనే ‘కన్నప్ప’లో బాలయ్య ఎంట్రీపై అధికారిక ప్రకటన రానున్నట్టు తెలుస్తోంది.

Related Posts