“బాహుబ‌లి 3” కూడా ఉందన్న జ‌క్క‌న్న‌

తెలుగు సినిమా స‌త్తాను ప్ర‌పంచానికి చాటి చెప్పిన సంచ‌ల‌న చిత్రం బాహుబ‌లి. అంతే కాకుండా.. ఈ సినిమా 1000 కోట్లు క‌లెక్ట్ చేసింది. ఈ రికార్డ్ సాధించిన తొలి ఇండియాన్ సినిమాగా చ‌రిత్ర సృష్టించింది. బాలీవుడ్ కి షాక్ ఇచ్చింది. అందుక‌నే బాహుబ‌లి చిత్రాన్ని ఇండియన్ అవతార్ అనడంలో సందేహం లేదని కొందరు నెటిజన్స్ విశ్లేషించారు. అంతటి గొప్ప బాహుబలిని మళ్లీ మళ్లీ కొత్తగా చూడాలని అభిమానులు కోరుకోవడం చాలా సహజమైన విషయం.

ఇదే విషయం గురించి రాజ‌మౌళిని అడిగితే క్లారిటీ ఇచ్చారు. ఇంత‌కీ మేట‌ర్ ఏంటంటే.. సంక్రాంతి కానుక‌గా ఆర్ఆర్ఆర్ జ‌న‌వ‌రి 7న విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా ఈ సినిమాను భారీ ఎత్తున జక్కన్న ప్రమోట్ చేస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్ లో భాగాంగా మీడియా ముందుకు వ‌చ్చిన రాజ‌మౌళిని మహేష్ బాబుతో సినిమా గురించి అడిగితే.. తన తదుపరిరాజ‌మౌళి,ఆర్ఆర్ఆర్ సినిమా మ‌హేష్ బాబుతోనే ఉంటుంది. అయితే.. ఎప్పుడు ఉంటుంద‌ని అనేది ఇంకా క్లారిటీ లేదు అన్నారు.

ఇక బాహబులి 3 సినిమా గురించి కూడా ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. బాహుబలి సినిమా మూడవ భాగం ఖచ్చితంగారాజ‌మౌళి,ఆర్ఆర్ఆర్ ఉంటుందనే నమ్మకంను రాజమౌళి వ్యక్తం చేశాడు. బాహుబలి మూడవ పార్ట్ కు ఖచ్చితంగా స్కోప్ ఉంది. కనుక ఇప్పుడు కాకున్నా భవిష్యత్తులో అయినా ఖ‌చ్చితంగా బాహుబలి 3 ఉంటుందన్నారు. ఆర్ఆర్ఆర్ త‌ర్వాత రాజ‌మౌళి చేసే సినిమా మ‌హేష్ తోనే. ఆత‌ర్వాత బాహుబ‌లి 3 ఉంటుందేమో చూడాలి.

Related Posts