ఈ సారి సమ్మోహనపరుస్తారా ..?

బ్యాక్ గ్రౌండ్ ఉంది. కానీ వారసత్వంగా వచ్చాడు అని చెప్పలేం. ఎందుకంటే ఆ బ్యాక్ గ్రౌండ్ ను వాడుకుని అతను ఎదగడం లేదు. తనదైన టాలెంట్ తోనే టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్లేస్ సంపాదించుకుంటున్నాడు. చిన్న సినిమాలతో మొదలైనా.. మీడియం రేంజ్ మూవీస్ వరకూ వచ్చి.. హిట్, ఫ్లాప్స్ తో పనిలేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతోన్న ఆ హీరో సుధీర్ బాబు. సూపర్ స్టార్ కృష్ణ అల్లుడుగా, మహేష్ బాబు బావగా వచ్చినా.. స్వయంకృషితోనే ఎదుగుతున్న సుధీర్ బాబు బర్త్ డే ఇవాళ.


ఇండస్ట్రీకి సూపర్ స్టార్ కృష్ణగారి ఫ్యామిలీ నుంచి వచ్చాడు సుధీర్ బాబు. కానీ తను ఎదగడానికి ఆ ఫ్యామిలీని వాడుకున్న దాఖలాలు కనిపించవు. ఎప్పుడైనా ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ కో లేక ఆడియో ఫంక్షన్స్ కో మహేష్ బాబు సాయం తీసుకుని ఉండొచ్చు. ఆ మాత్రం సాయం మహేష్ చాలామందికి చేశాడు కాబట్టి అదేమంత పెద్ద మేటర్ కాదు. శివ మనసులో శ్రుతి అనే సినిమాతో హీరోగా పరిచయమైనా అంతకు ముందు ఏమాయ చేశావెలో సమంత అన్న పాత్రలో కనిపించాడు సుధీర్. తర్వాత ఒక్కో సినిమాతో ఎదుగుతూ.. ప్రేమకథా చిత్రమ్ తో సూపర్ హిట్ అందుకున్నాడు.

ప్రేమకథా చిత్రమ్ తర్వాత ఫిజిక్ మార్చుకున్నాడు. అద్భుతమైన డ్యాన్సులు చేశాడు. కానీ మళ్లీ హిట్ రావడానికి టైమ్ పట్టింది. అయినా ప్రతి సినిమాకూ కష్టపడ్డాడు. కృష్ణమ్మకలిపింది ఇద్దరినితో నటుడుగా ఆకట్టుకున్నాడు. భలే మంచి రోజుతో మరో విజయం వచ్చింది. అటుపై ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్ లో చేసిన సమ్మోహనం, నన్ను దోచుకుందువటేతో సూపర్ హిట్ కొట్టాడు. మరోవైపు హిందీ చిత్రం భాగీలో విలన్ గా అలరించాడు. రీసెంట్ గా వచ్చిన శ్రీదేవి సోడా సెంటర్ లో నటుడుగా అదరగొట్టాడు.

ప్రస్తుతం మోహనకృష్ణ దర్శకత్వంలోనే ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే మూవీ చేస్తున్నాడు. దీంతో పాటు మామా మశ్చీంద్రా అనే చిత్రం కూడా వస్తోంది. ఈ రెండు సినిమాల ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను తన బర్త్ డే సందర్భంగా విడుదల చేశారు. అయితే ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా పై మొదటి నుంచి ఓ పాజిటివ్ వైబ్ ఉంది. సమ్మోహనం తర్వాత ఇదే కాంబోలో వచ్చిన వి ఫ్లాప్ అయినా.. ఈసారి గ్యారెంటీగా కొడతారు అంటున్నారు. పైగా ఈ చిత్రంలో లేటెస్ట్ సెన్సేషన్ కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. అందుకే మరోసారి ఈ కాంబినేషన్ సమ్మోహనపరుస్తుంది అంటున్నారు. మొత్తంగా వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ వెళుతోన్న సుధీర్ మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటూ అతనికి బర్త్ డే విషెస్ చెబుదాం.

Telugu 70mm

Recent Posts

వాస్తవ సంఘటనల ఆధారంగా వరుణ్ సందేశ్ ‘నింద’

యంగ్ హీరో వరుణ్ సందేశ్ లేటెస్ట్ మూవీ 'నింద'. కాండ్రకోట మిస్టరీ అంటూ యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా…

14 hours ago

‘లవ్‌ మీ’ ట్రైలర్.. దిల్‌రాజు కాంపౌండ్ నుంచి వస్తోన్న దెయ్యం కథ

ఇప్పటివరకూ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ తో అలరించిన నిర్మాత దిల్‌రాజు.. ఈసారి ఓ దెయ్యం కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.…

14 hours ago

సరిగమ సంస్థకు ‘కల్కి’ ఆడియో రైట్స్

స్టార్ హీరోలు నటించే సినిమాల ఆడియో రైట్స్ కు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. వారు నటించే సినిమాల ఆడియో రైట్స్…

14 hours ago

Raj Tarun is coming as ‘Purushothamudu

Young hero Raj Tarun's latest movie is 'Purushothamudu'. Dr. Ramesh Tejawat and Prakash Tejawat are…

15 hours ago

మత్స్యకన్య గా మారిన అవికా గోర్

చిన్నారి పెళ్లికూతురుగా బుల్లితెరపై పరిచయమై.. 'ఉయ్యాల జంపాల'తో హీరోయిన్ గా సెటిలైన బ్యూటీ అవికా గోర్. మొదట్లో 'సినిమా చూపిస్తా…

15 hours ago

దర్శకుల సంఘం వేడుకకు రంగం సిద్ధం

కోవిడ్ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో చెప్పుకోదగ్గ వేడుకలేవీ జరగలేదు. తారలంతా ఒకే వేదికపై కనిపించిన దాఖలాలు దాదాపు లేవనే…

15 hours ago