డిసెంబర్ 16న మరో మహాద్భుతం

అద్భుతం.. ఈ మాట సులువుగా అనేస్తుంటాం కానీ.. అనుభవంలోకి వచ్చినప్పుడు మాత్రమే ఆ అనుభూతిని పొందగలుగుతాం. ముఖ్యంగా సినిమాల విషయంలో ఈ ఫీలింగ్ చాలా అరుదుగా వస్తుంది. అలా వచ్చినప్పుడు దాని అనుభూతి అంత త్వరగా మనసుల్లోని వెళ్లదు. అలాంటి అద్భుత చిత్రాల్లో ఒకటి అవతార్. అవతార్ కంటే ముందే ఇలాంటి ఎన్నో అద్భుతాలను ప్రేక్షకులకు చూపించిన దర్శకుడు జేమ్స్ కామెరూన్ మస్తిష్కం నుంచి వెలువడిన మరో మహాద్భుతమే అవతార్. ఓ రకంగా ఇది భారతీయ జానపద కథలకు అతి దగ్గరగా కనిపించే కథ కూడా. అయినా ప్రపంచం మొత్తాన్నీ అబ్బురపరిచింది. పండోరా అనే ఓ కొత్త గ్రహాన్ని క్రియేట్ చేసి తనదైన మాయాజాలంలో ప్రపంచ ప్రేక్షకులను ఆ లోకానికి తీసుకువెళ్లాడు. అవతార్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని రికార్డ్స్ ను కొల్లగొట్టిందో అందరికీ తెలుసు. ఇప్పటికీ హయ్యొస్ట్ కలెక్షన్స్ రికార్డ్ అవతార్ పేరు మీదే ఉంది. అలాంటి చిత్రానికి మరో రెండు సీక్వెల్స్ తీస్తానని ప్రకటించాడు జేమ్స్ కామెరూన్. అందులో మొదటి సీక్వెల్ ఈ యేడాది డిసెంబర్ 16న విడుదల కాబోతోంది.
ఫస్ట్ పార్ట్ లో పండోరా గ్రహానికి తీసుకువెళ్లిన జేమ్స్ .. ఈ సారి అండర్ వాటర్ లో మరో అద్భుత ప్రపంచాన్ని సృష్టించాడట. నిజానికి ఈ చిత్ర ప్రొడక్షన్ వర్క్(షూటింగ్) అయిపోయింది. అయితే హాలీవుడ్ సినిమాలకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్కే ఎక్కువగా ఉంటుంది కదా.. పైగా జేమ్స్ మూవీ అంటే విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ ఓ రేంజ్ లో ఉంటాయి. ఎంత ఖర్చయినా.. అవన్నీ తను అనుకున్నట్టుగా వచ్చే వరకూ ఆగుతాడు జేమ్స్. అందుకే సీక్వెల్ రావడానికి ఇంత టైమ్ పట్టింది. ఏదైతేనేం.. 2021లోనే వస్తుందనుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఈ యేడాది డిసెంబర్ 16న విడుదల చేస్తున్నట్టు యేడాది ముందే ప్రకటించారు. అంటే ఆ టైమ్ కు ముందు వెనక ఎవరున్నా.. ముందే సర్దేసుకుంటారు అని వేరే చెప్పక్కర్లేదేమో..?

Related Posts