గతవారం విడుదలైన చిత్రాలలో నాని నటించిన ‘హాయ్ నాన్న‘ బాక్సాఫీస్ వద్ద జోరుగా సందడి చేస్తుంది. ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల వారిని సైతం ఈ చిత్రం ఆకట్టుకుంటుంది. లేటెస్ట్ గా ‘హాయ్ నాన్న‘ని వీక్షించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీ టీమ్ కి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశాడు.
మొదటగా సోదరుడు నాని ఈ సినిమాలో హృదయానికి హత్తుకునేలా తన పెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడని.. ‘హాయ్ నాన్న‘ వంటి ఆకర్షణీయమైన స్క్రిప్ట్ ను వెలుగులోకి తీసుకొచ్చినందుకు అతనికి అభినందనలు తెలిపాడు. మృణాల్ అందం లాగే ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ కూడా సినిమాకి ఎంతో అందాన్ని తీసుకొచ్చిందని హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ని పొగడ్తలతో ముంచెత్తాడు ఐకాన్ స్టార్. తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో బేబీ కియారా నటన అద్భుతం అన్నాడు. ‘బేబీ కియారా.. మై డార్లింగ్.. నీ క్యూట్‌నెస్‌తో హృదయాలను ద్రవింపజేస్తున్నావు. చాలు ! ఇప్పుడే బడికి వెళ్ళు‘ అంటూ కియారాకి తన మెస్సేజ్ తెలియజేశాడు.
ఆర్టిస్టులతో పాటు టెక్నీషియన్స్ అయిన సినిమాటోగ్రాఫర్ ఎస్.జె.వర్ఘీస్, మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వహబ్ లకు ప్రత్యేకమైన శుభాకాంక్షలు అందించాడు. ఇక.. హృదయాన్ని హత్తుకునేలా ఎమోషన్స్ ను ఆన్ స్క్రీన్ పై అద్భుతంగా ఆవిష్కరించిన డైరెక్టర్ శౌర్యువ్ ని మెచ్చుకున్నాడు బన్నీ. మొత్తంగా ‘హాయ్ నాన్న‘.. తండ్రులనే కాకుండా ప్రతి కుటుంబ సభ్యుల హృదయాలను హత్తుకుంటుంది అంటూ ఈ సినిమాపై తన రివ్యూ అందించాడు అల్లు అర్జున్.
No matter how many heroes we have, there are only a few who have reached…
Elections are going to be held in two Telugu states tomorrow (May 13). While elections…
Most Awaiting Movie 'Double Ismart' Starring Energetic Star Ram. This movie is being made as…
మనకు ఎంతమంది హీరోలున్నా.. నటనలో ఉన్నత శిఖరాలు అధిరోహించిన వారు అతికొద్దిమంది మాత్రమే ఉంటారు. అలాంటి వారిలో కోలీవుడ్ స్టార్…
రేపు (మే 13న) రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, పార్లమెంటుకి ఎన్నికలు జరుగుతుండగా.. తెలంగాణలో…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటిస్తున్న మోస్ట్ అవైటింగ్ మూవీ ‘డబుల్ ఇస్మార్ట్‘. ఇప్పటికే సూపర్ డూపర్ హిట్టైన ‘ఇస్మార్ట్ శంకర్‘కి…