టాలీవుడ్ క్రేజీ మూవీస్ అన్నీ నెట్‌ఫ్లిక్స్ లోనే..

2024లో తమ ప్లాట్ ఫామ్ లో రాబోయే సినిమాలను అఫీషియల్ గా అనౌన్స్ చేసింది ఓటీటీ జయంట్ నెట్ ఫ్లిక్స్. ఈ ఏడాది టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా లెవెల్ లో రాబోతున్న పలు క్రేజీ మూవీస్ నెట్ ఫ్లిక్స్ లోనే స్ట్రీమింగ్ కి రెడీ అవుతుండడం ఓ విశేషమనే చెప్పాలి. ఇక.. ఈ ఏడాది నెట్ ఫ్లిక్స్ లో సందడి చేయబోయే ఆ మోస్ట్ అవైటింగ్ మూవీస్ లిస్ట్ ఇలా ఉంది.

వీటిలో ఇప్పటికే విడుదలైన రెబల్ స్టార్ ప్రభాస్ ‘సలార్‘, మహేష్ బాబు ‘గుంటూరు కారం‘తో పాటు.. వేసవిలో వచ్చే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర‘, ఆగస్టులో విడుదలయ్యే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2‘ వంటి సినిమాలున్నాయి. ఇంకా.. నటసింహం బాలకృష్ణ నటిస్తున్న ‘ఎన్.బి.కె. 109‘, విజయ్ దేవరకొండ 12, సిద్ధు జొన్నలగడ్డ ‘టిల్లు స్క్వేర్‘, విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి‘ వంటి సినిమాలు నెట్ ఫ్లిక్స్ విష్ లిస్ట్ లో ఉన్నాయి.

Related Posts