మైనర్స్ తో చెడుగా ప్రవర్తించిన నటుడు..

నటుడు అంటే కొమ్ములు వచ్చి ఉండవు. కామన్ మేన్ కు ఉండే హక్కులే అతనికీ ఉంటాయి. అవి దాటి ప్రవర్తిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని కేరళ పోలీస్ లు మరోసారి నిరూపించారు. ఆ మధ్య టాప్ యాక్టర్ దిలీప్ పై ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ధైర్యంగా కేస్ బుక్ చేశారు అక్కడి పోలీస్ లు. లేటెస్ట్ గా మరోసారి అలాంటి కేస్ లోనే మరో నటుడు శ్రీజిత్ రవిపైనా బుక్ చేశారు. అయితే ఇది దిలీప్ లాంటి కేస్ కాదు. అయినా అత్యంత జుగుప్సాకరమైన కేస్. కేరళలోని త్రిశూర్ జిల్లాలో జరిగిన ఈ ఘటన గురించి తెలిస్తే నోరెళ్లబెడతారు.మళయాలంలో వెల్ నోన్ ఆర్టిస్ట్ గా ఉన్న శ్రీజిత్ రవి త్రిశూర్ జిల్లాలోని ఓ ప్రాంతానికి వెళ్లాడట. కార్ లో ఉన్న ఈ ఆర్టిస్ట్ ను చూసిన ఇద్దరు చిన్న పిల్లలు( అమ్మాయిలు) అతని వద్దకు వెళ్లారట. దీంతో అతను కార్ దిగి ప్యాంట్ జిప్ తీసి వారితో అసభ్యంగా ప్రవర్తించాడట. దీంతో భయపడిన ఆ మైనర్స్ అమ్మాయిలు జరిగిన విషయాన్ని చుట్టుపక్కల వారికి చెప్పారు. జనం వస్తున్నది చూసి కార్ లో పారిపోయాడు శ్రీజిత్. కానీ కార్ నంబర్ ఆధారంగా పోలీస్ లకు కంప్లైంట్ ఇచ్చారు స్థానికులు.

పోలీస్ ఇంక్వైరీలో అలా చేసింది నటుడు శ్రీజిత్ అని తెలిసింది. ఆ అమ్మాయిలు కూడా అతన్ని గుర్తుపట్టడంతో అతనిపై సెక్షన్ 11 ఆధారంగా పోక్సో(ప్రాటెక్షన్ ఆఫ్‌ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ ఆఫెన్స్) చట్టం కింద కేస్ బుక్ చేశారు.ఎంక్టైరీ టైమ్ లో శ్రీజిత్ తప్పైందని క్షమాపణ చెబుతానంటూ వేడుకున్నాడట. కానీ అతనిపై గతంలో కూడా ఇలాంటి కేసే ఒకటి ఉంది. ఆ కేస్ మైనర్స్ కు సంబంధించింది కాదు.. అయినా పోలీస్ లు అతని నటనను పట్టించుకోకుండా కేస్ బుక్ చేశారు. అయితే శ్రీజిత్ తండ్రి టిజి రవి మళయాల సినిమా పరిశ్రమలో కాస్త పేరున్నవాడు కావడంతో అతని ఇన్ ఫ్లూయొన్స్ వల్ల ఇతనికి వెంటనే బెయిల్ వచ్చింది. పోలీస్ లు బలమైన సాక్ష్యాధారాలు సేకరించడంలో ఫెయిల్ అవడం వల్లే శ్రీజిత్ కు బెయిల్ వచ్చిందంటూ ఆ బాలికల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మొత్తంగా సంచలనంగా వెలుగులోకి రావాల్సిన ఈ వార్త ఇలా సైలెంట్ గా వెళుతుండటంపైనా విమర్శలు వస్తున్నాయి. మరి ఫైనల్ గా శ్రీజిత్ కు ఎలాంటి శిక్ష పడుతుందో చూడాలి.

Related Posts